Begin typing your search above and press return to search.

చిరు చెప్పిన ‘ఇంటిగుట్టు’

By:  Tupaki Desk   |   16 Jan 2017 2:55 PM IST
చిరు చెప్పిన ‘ఇంటిగుట్టు’
X
ఇండస్ట్రీలో ఇంతకాలం ఉన్నప్పటికీ మెగాస్టార్ చిరుకు సంబంధించిన చాలా సంగతులు జనాలకు తెలీదన్న విషయం.. గడిచిన కొద్దిరోజులుగా సాగుతున్న ఖైదీ ప్రమోషన్ పుణ్యమా తెలుస్తుందని చెప్పాలి. ఖైదీ నంబరు 150 ప్రమోషనల్ యాక్టివిటీస్ లో భాగంగా.. చిరు అండ్ టీం పలు ఇంటర్వ్యూలు ఇవ్వటం తెలిసిందే. ఈ సందర్భంగా అడుగుతున్న పలు ప్రశ్నలకు ఆయన చెబుతున్న సమాధానాలు ఆసక్తికరంగా ఉండటమే కాదు.. గతంలో ఆయన చెప్పని అంశాలు ఉండటం గమనార్హం.

149 సినిమాలు చేసిన చిరు తన గురించి చాలానే చెప్పినా.. తన సతీమణి సురేఖ గురించి బయటకు చెప్పిన విషయాలు కాస్త తక్కువే. అయితే.. ఈసారి అందుకు భిన్నంగా తన భార్య సెలక్షన్ గురించి.. సందేహాల గురించి చిరు ఆసక్తికర ముచ్చట్లు చెప్పుకొచ్చారు. ఖైదీ సినిమాకు కాజల్ ను హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నప్పుడు చిరు ఇంట్లో చాలానే చర్చ జరిగినట్లుగా చిరు మాటల్ని వింటే అర్థం కాక మానదు.

కాజల్ ను ఓకే చేసే విషయంలో చిరు అన్యమనస్కంగానే ఒప్పుకున్నారట. చెర్రీతో ఆడిపాడిన అమ్మాయితో నేనా? అన్న ప్రశ్న కూడా వేసుకున్నారట. అయితే.. కాజల్ తో కలిసి దిగిన తొలి రొమాంటిక్ లుక్ రిలీజ్ అయ్యాక.. చిరు సతీమణి సురేఖ.. భలే సూటయ్యారని కాంప్లిమెంట్ ఇచ్చేశారట. అప్పటికి కానీ తన మనసులోని సందేహాల పర్వానికి తెర పడలేదని చిరు చెప్పుకొచ్చారు. ఈ విషయమంతా ఎవరో చెప్పలేదు.. ఇంటిగుట్టును చిరునే ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/