Begin typing your search above and press return to search.

మెగా డాటర్ వాళ్ళకు థ్యాంక్స్ చెప్పింది!

By:  Tupaki Desk   |   5 Oct 2016 9:26 AM GMT
మెగా డాటర్ వాళ్ళకు థ్యాంక్స్ చెప్పింది!
X
అప్పుడెప్పుడో జైచిరంజీవి.. శంకర్ దాదా జిందాబాద్ సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసిన మెగాస్టార్ చిరంజీవి పెద్దకూతురు సుస్మిత.. ఆ తరువాత మళ్ళీ సినిమాలవైపు రాలేదు. ఇప్పుడు చిరంజీవి ఎలాగైతే 150వ సినిమాతో వెండితెరపై గ్రాండ్ గా రి-ఎంట్రీ ఇస్తున్నారో ఇప్పుడు సుస్మిత కూడా సేమ్ అదే సినిమాతో తిరిగి కత్తెర పుచ్చుకుని కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తోంది.

అయితే గత మూడు నెలలుగా కంటిన్యూస్ గా చిరంజీవి సినిమా షూటింగ్ జరుగుతూనే ఉంది. ముఖ్యంగా సుస్మిత చిరంజీవి కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తోంది కాబట్టి.. ఆమెకు చేతినిండా పనే. అందుకే షూటింగ్ నుండి విరామం తీసుకోవడం కుదర్లేదు. ఇప్పుడిక 70% షూటింగ్ పూర్తయ్యాక భారీగా షెడ్యూల్ గ్యాపిచ్చారు. ఈ సందర్బంగా సుస్మిత ఏమంటోందంటే.. ''మా ఆయనకు.. నా కూతుళ్ళకు థ్యాంక్స్ చెప్పాల్సిందే. వాళ్ళు చాలా సూపర్ సపోర్టివ్. లేకపోతే ఇలా పని అండ్ ట్రావెల్.. మధ్యలో అస్సలు బ్యాలెన్స్ కుదిరేది కాదు'' అంటూ సెలవిచ్చింది మెగా డాటర్.

ఇప్పటికే రిలీజైన కొన్ని స్టిల్స్ చూస్తుంటే.. ఈ సినిమా కోసం సుస్మిత డిజైన చేసిన చిరంజీవి లుక్స్ చాలా బాగున్నాయనే చెప్పాలి. మరి త్వరోలనే పాటల షూటింగ్ మొదలవ్వబోతోంది కాబట్టి.. పాటల్లో డాడ్ మెగాస్టార్ ను ఎలా చూపిస్తుందో తెలియాలంటే.. ఇంకొంత కాలం వేచి చూడాల్సిందే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/