Begin typing your search above and press return to search.

ఫోర్ట్ సిటీలో చిరు కూతురు పెళ్లి ఫిక్స్..

By:  Tupaki Desk   |   27 Feb 2016 9:36 AM GMT
ఫోర్ట్ సిటీలో చిరు కూతురు పెళ్లి ఫిక్స్..
X
మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ వివాహం సెటిల్ అయిన విషయం తెలిసిందే. తన గతం నుంచి బయటపడి పెళ్లికి శ్రీజ అంగీకరించడంతో.. ఇప్పుడు మెగా ఫ్యామిలీ మొత్తం ఆనందంలో ఉన్నారు. ప్రస్తుతం చిరు చిన్న కూతురు పెళ్లి పనులు వేగం పెరిగాయి కూడా. శ్రీజ-కళ్యాణ్ ల పెళ్లి మార్చి 28న జరగనుంది. ముందు ఈ వివాహాన్ని హైద్రాబాద్ లోనే అంగరంగ వైభవంగా జరపాలని భావించారు. కానీ తర్వాత పెళ్లి వేడుకను తిరుపతి జరుపుతారనే వార్తలొచ్చాయి.

ఇప్పుడీ రెండు ప్రాంతాలు కాకుండా.. రాజస్థాన్ లోని జైపూర్ లో శ్రీజ పెళ్లి చేయాలని నిర్ణయించారు. ఇందుకు కారణాలు చెప్పకపోయినా.. ఇప్పుడు డెస్టినేషన్ వెడ్డింగ్స్ అనే కాన్సెప్ట్ బాగా పెరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఇలా జైపూర్ కు శ్రీజ-కళ్యాణ్ పెళ్లి వేదిక మారిందని తెలుస్తోంది. తనకు అత్యంత ఇష్టమైన చిన్న కూతురి పెళ్లిని జైపూర్ లోని ఓ ప్యాలెస్ లో జరపబోతున్నారు చిరంజీవి. ఈ వేడుకకు చిరు ఫ్యామిలీ మొత్తం హాజరు కానుంది. పెళ్లికి కొన్ని రోజుల ముందే రెండు వైపుల నుంచి మొత్తం అందరూ జైపూర్ చేరుకుంటారు.

అయితే.. హైద్రాబాద్ లో పెళ్లి వేడుక జరగకపోవడం మెగా అభిమానులకు కొంత నిరుత్సాహం కలిగించింది. కానీ.. పెళ్లికి తగ్గ స్థాయిలోనే ఓ మెగా గ్రాండ్ రిసెప్షన్ ను హైద్రాబాద్ లో ఏర్పాటు చేయాలని చిరు ఫ్యామిలీ నిర్ణయించారని తెలుస్తోంది.