Begin typing your search above and press return to search.

పూరి ఎటకారానాకి మెగా సెటైరేమో!!

By:  Tupaki Desk   |   28 Sept 2015 11:00 PM IST
పూరి ఎటకారానాకి మెగా సెటైరేమో!!
X
మొత్తానికి పూరి జగన్‌ ఒక బాంబ్‌ పేల్చాడు. అసలు మెగాస్టార్‌ చిరంజీవి నాకు చెప్పకుండా డైరెక్టుగా సెకండాఫ్‌ బాలేదని మీడియాకు ఎందుకు చెప్పారో.. అదే నాకే చెప్పుంటే నేను సెకండాఫ్‌ లో కావల్సిన మార్పులు చేసి పిచ్చెత్తించేవాడిని అని సెలవిచ్చాడు. కాని ఇక్కడే ఓ విషయం లో లాజిక్‌ కరక్టుగా సింకవుతోంది. ఇదంతా చూస్తుంటే పూరి ఎటకారానికి మెగా సెటైర్ లా ఉంది.

ఏంటంటే.. అప్పట్లో చిరంజీవికి 'ఆటో జానీ' అనే సినిమా సెకండాఫ్‌ నెరేట్‌ చేసిన పూరి జగన్‌ కు.. ఈ సెకండాఫ్‌ చిరంజీవికి నచ్చలేదనే విషయం ఈజీగా అర్ధమైయుండాలి. నా అభిప్రాయం తరువాత చెబుతా అన్నారంటే అంతేగా మరి అర్ధం. అయితే మనోడు స్ర్కిప్టు మీద వర్కు చేయకుండా.. వెంటనే మహేష్‌ బాబుతో కొత్త కథ ఓకె అయ్యింది అంటూ ఒక ట్వీటు.. నితిన్‌ తో సినిమాను షూటింగ్‌ స్టార్టు చేస్తున్నా అంటూ మరో ట్వీటు వేశాడు. అప్పుడే అర్ధమైంది జనాలకు... అసలు ఈ 150వ సినిమా తంతేదో తేడా వచ్చేసిందని. ఆ తరువాత నితిన్‌ బ్యాకవుట్‌ అయితే వెంటనే వరుణ్‌ తేజ్‌ తో షూటింగ్‌ మొదలెట్టుకున్నాడు పూరి.

ఒకవేళ నిజంగానే చిరంజీవి 150వ సినిమా పట్ల నిబద్దత ఉంటే.. అప్పుడే సెకండాఫ్‌ మీద టైమ్‌ స్పెండ్‌ చేయాల్సింది. మహేష్‌ కోసం ఒక లైన్‌, నితిన్‌ తో సినిమా.. అబ్బే వరుణ్‌ తో సినిమా.. అంటూ అవుటాఫ్‌ ఫోకస్డ్‌ గా ఉంటే.. పైగా ఆ విషయాలన్నీ ట్విట్టర్‌ లో పోస్టు చేస్తుంటే.. మెగాస్టార్‌ మాత్రం సెకండాఫ్‌ బాలేదని పూరికి ఫోన్ చేసి చెప్పాలా? ఆయన కూడా పూరి ఎటకారానికి సరైన మందులో మీడియా ముందే సెకండాఫ్‌ బాలేదు అంటూ సెటైర్‌ వేశారేమో.. ఏమో పూరి.. ఏదైనా అయ్యుండొచ్చు.