Begin typing your search above and press return to search.

డైరెక్టర్ బాబీ కి మెగాస్టార్‌ ఖరీదైన బహుమతి

By:  Tupaki Desk   |   19 Jan 2023 6:30 AM GMT
డైరెక్టర్ బాబీ కి మెగాస్టార్‌ ఖరీదైన బహుమతి
X
మెగాస్టార్ చిరంజీవి ఈ సంక్రాంతికి వాల్తేరు వీరయ్య సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చి సాలిడ్ మాస్ హిట్‌ ను దక్కించుకున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ వారు అధికారికంగా చెబుతున్న లెక్కల ప్రకారం ఇప్పటికే యూఎస్ లో ఈ సినిమా రెండు మిలియన్ డాలర్ల వసూళ్లను క్రాస్ చేసింది.. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా వంద కోట్లకు పైగా వసూళ్లు నమోదు అయ్యాయి.

చిరంజీవి గత చిత్రాలు ఆచార్య మరియు గాడ్ ఫాదర్ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయాయి. గాడ్‌ ఫాదర్ సినిమా పర్వాలేదు కానీ ఆచార్య సినిమా తీవ్రంగా నిరాశ పర్చింది.

అందుకే వాల్తేరు వీరయ్య సినిమాపై మెగా ఫ్యాన్స్ తో పాటు మెగాస్టార్‌ చిరంజీవి కూడా చాలా హోప్స్‌ పెట్టుకున్నాడు. మెగా ఫ్యాన్స్ కి కావాల్సిన మాస్ ఎంటర్‌ టైన్మెంట్స్ ను బాబీ ఈ సినిమాతో అందించాడు.

చాలా రోజుల తర్వాత చిరంజీవిని మాస్ ప్రేక్షకులు మెచ్చే విధంగా చూపించిన దర్శకుడు బాబీపై ప్రశంసల జల్లు కురుస్తోంది. వాల్తేరు వీరయ్య సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో దర్శకుడు బాబీ కి మెగాస్టార్ చిరంజీవి ఒక ఖరీదైన బహుమతిని ఇచ్చాడంటూ ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

చిరంజీవి కి బాబీ సుదీర్ఘ కాలంగా మెగా ఫ్యాన్‌. ఒక అభిమానిగా చిరంజీవిని వాల్తేరు వీరయ్య సినిమాలో దర్శకుడు బాబీ చూపించాడు. అందుకే ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుందనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది.

బాబీ తనపై చూపించిన అభిమానానికి చిరంజీవి ఉబ్బి తబ్బిబ్బు అయ్యాడు. అందుకే ఆ ఖరీదైన బహుమానం ను ఇచ్చాడని మెగా కాంపౌండ్ నుండి సమాచారం అందుతోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.