Begin typing your search above and press return to search.
ఏదో ఒకరోజు పవన్ అనుకున్నది సాధిస్తాడు: చిరంజీవి
By: Tupaki Desk | 23 April 2020 10:45 AM ISTమెగాస్టార్ చిరంజీవి ఈమధ్య సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే మిగతా స్టార్ హీరోల లాగా కాకుండా చిరు చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. వెబ్ మీడియాతో కూడా ముచ్చటిస్తున్నారు. ఈమధ్య ఒక ఇంటర్వ్యూలో రాజకీయాల పట్ల తన ఆలోచన.. తమ్ముడు పవన్ కళ్యాణ్ నడిపిస్తున్న జనసేన గురించి కూడా మాట్లాడారు.
ఇప్పుడు అరవై నాలుగేళ్ల వయసులో కొత్త పార్టీలో చేరడం.. రాజకీయ పయనం కొనసాగించడం అంత సులువు కాదని అభిప్రాయపడ్డారు. టూరిజం మినిస్టర్ గా ఉన్న సమయంలో తనకు చేయగలిగినంత చేశానని వెల్లడించారు. చాలా దేశాలలో భారతీయులకు ఉపయోగపడేలా 'ఆన్ అరైవల్ వీసా' ను అమలులోకి తీసుకురావడంలో తన కృషి ఉందన్నారు. పవన్ గురించి మాట్లాడుతూ.. తమ దారులు వేరు కానీ గమ్యం మాత్రం ఒకటేనని అన్నారు. పవన్ కు రాజకీయాలకు సంబంధించిన సలహాలు ఇవ్వనని తెలిపారు. సిటీకి పవన్ వచ్చినప్పుడు అమ్మగారిని కలిసేందుకు ఇంటికి వస్తాడని.. తమతోనే కలిసి డిన్నర్ చేస్తాడని తెలిపారు. ఆ సమయం లో కుటుంబ విషయాలు మాట్లాడుకుంటామని వెల్లడించారు.
కుటుంబం అంతా పవన్ కు మద్దతుగా నిలుస్తుందని అన్నారు. ప్రజారాజ్యం పార్టీలో పనిచేసిన సమయంలో పవన్ ఎన్నో ముఖ్యమైన విషయాలు నేర్చుకున్నాడని.. ఏదో ఒకరోజు పవన్ తను అనుకున్నది సాధిస్తాడని తనకు నమ్మకం ఉందన్నారు.