Begin typing your search above and press return to search.
'వకీల్ సాబ్' కు 'ఆచార్య' రివ్యూ..!
By: Tupaki Desk | 10 April 2021 12:13 PM ISTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'వకీల్ సాబ్' సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని బోనీ కపూర్ - దిల్ రాజు కలిసి నిర్మించారు. 'పింక్' రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రం మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ తో నడుస్తోంది. పవన్ దాదాపు మూడేళ్ళ తర్వాత ఒక పవర్ ఫుల్ కథతో రావడంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక పలువురు సినీ ప్రముఖులు ఈ సినిమా చూసి సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా 'వకీల్ సాబ్' సినిమాకు రివ్యూ ఇచ్చారు. శుక్రవారం రాత్రి చిరు కుటుంబ సమేతంగా ఏఎంబీ సినిమాస్ మల్టీప్లెక్స్ లో ఈ సినిమాని వీక్షించారు.
ఈ సందర్భంగా 'వకీల్ సాబ్' సినిమా పైన తనదైన శైలిలో స్పందించిన చిరంజీవి.. తమ్ముడు పవన్ కళ్యాణ్ మీద ప్రశంసల వర్షం కురిపించారు. ''మూడేళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్ లో అదే వేడి.. అదే వాడి.. అదే పవర్. ప్రకాష్ రాజ్ తో కోర్ట్ రూమ్ డ్రామా అద్భుతం. నివేద థామస్ - అంజలీ - అనన్య వారి పాత్రల్లో జీవించారు. థమన్ - డీఓపీ వినోద్ సినిమాకు ప్రాణం పోశారు. దిల్ రాజు - బోనీ కపూర్ - దర్శకుడు వేణు శ్రీరామ్ కు మిగతా టీమ్ అందరికీ నా శుభాకాంక్షలు. అన్నిటికి మించి ఇది మహిళలకు ఇవ్వాల్సిన గౌరవాన్ని తెలియజేసే ఒక అత్యవసరమైన చిత్రం. ఈ వకీల్ సాబ్ కేసులనే కాదు, అందరి మనసుల్నీ గెలుస్తాడు!'' అంటూ ట్వీట్ చేశారు చిరంజీవి. 'వకీల్ సాబ్' కు 'ఆచార్య' ఇచ్చిన రివ్యూ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.