Begin typing your search above and press return to search.

రవితేజ సినిమాకి డైరెక్టర్ ని ఇచ్చిన చిరు

By:  Tupaki Desk   |   18 July 2016 10:40 AM IST
రవితేజ సినిమాకి డైరెక్టర్ ని ఇచ్చిన చిరు
X
జయంత్ సి పరాన్జీతో మెగా ఫ్యామిలీకి చాలానే రిలేషన్ ఉంది. ఓ డైరెక్టర్ మెగాస్టార్ చిరంజీవితో రెండు సినిమాలు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఓ మూవీ చేయడమంటే మాటలా? చిరుతో బావగారు బాగున్నారా.. శంకర్ దాదా ఎంబీబీఎస్ లను తీసిన జయంత్ సి పరాన్జీ.. పవన్ తో తీన్ మార్ చేశాడు. ఇప్పుడు ఓ రవితేజ సినిమాకి ఇతన్ని దర్శకుడిగా ఎంపిక చేశారట చిరు.

ఈ రవితేజ్ మాస్ మహరాజ్ కాదు. మంత్రి గంటా శ్రీనివాసరావు కొడుకు.. మంత్రి నారాయణకు అల్లుడే ఈ రవితేజ. ఇతను నటిస్తున్న చిత్రానికి దర్శకుడిగా జయంత్ సి పరాన్జీని చిరంజీవి సూచించారట. ఇలా గంటా కొడుకు మూవీకి దర్శకుడిని ఎంపిక చేసే బాధ్యత చిరు తీసుకోవడానికి కారణం.. వారిద్దరి మధ్యా గత దశబ్దానికి పైగా చిరు గంటాల ఉన్న సాన్నిహిత్యమే కారణం. ప్రజారాజ్యం నుంచి వీరి అనుబంధం కొనసాగుతుండగా.. ఇప్పటికీ కంటన్యూ అవుతోంది.

కాళహస్తి పేరుతో జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇప్పటికే ముహూర్తం షాట్ కూడా పూర్తి కాగా.. త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్నారు.