Begin typing your search above and press return to search.

మెగాస్టార్ 154 భారీ యాక్ష‌న్ షెడ్యూల్

By:  Tupaki Desk   |   27 March 2022 10:33 AM GMT
మెగాస్టార్ 154 భారీ యాక్ష‌న్ షెడ్యూల్
X
మెగాస్టార్ చిరంజీవి బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో మెగాస్టార్ చిరంజీవి - బాబీ (కెఎస్ రవీంద్ర) కాంబినేష‌న్ మూవీ (చిరు 154) ప్రస్తుతం హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో తెర‌కెక్కుతోంది.

ప్ర‌స్తుతం భారీ యాక్ష‌న్ స‌న్నివేశాన్ని తెర‌కెక్కిస్తున్నారు. చిరంజీవి .. ఫైటర్స్ పై ఊపిరి పీల్చుకోనివ్వ‌నంత భారీ యాక్షన్ ఎపిసోడ్ ని తెర‌కెక్కిస్తున్నారు. దీంతో టీమ్ కొత్త షూటింగ్ షెడ్యూల్ ను ప్రారంభించింది. ఫ్యాన్స్ కి మాస్ కి పండగలా సాగే యాక్షన్‌ బ్లాక్ ని రామ్‌-ల‌క్ష్మ‌ణ్‌ మాస్టర్స్‌ పర్యవేక్షిస్తున్నారు. హైదరాబాద్ లో జరుగుతున్న ఈ షెడ్యూల్ లోనే చిరంజీవి లేడీ లవ్‌ శ్రుతిహాసన్ కూడా చిత్ర‌బృందంలో చేరింది.

మెగాస్టార్ 154 అన్ని కమర్షియల్ హంగులతో కూడిన మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోంది. మెగాస్టార్ చిరంజీవి- దర్శకుడు బాబీతో శ్రుతిహాసన్ కి ఇది తొలిసారి ప్ర‌య‌త్నం. మాస్ అప్పీలింగ్ ఎలిమెంట్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరంజీవిని మునుపెన్నడూ చూడని మాస్ యాక్షన్ రోల్ లో బాబీ ప్రెజెంట్ చేస్తున్నాడు.

నవీన్ యెర్నేని- వై రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. జికె మోహన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం అగ్రశ్రేణి సాంకేతిక బృందం సహకరిస్తోంది. అయితే పలువురు ప్రముఖ నటీనటులు ఇందులో భాగమయ్యారు.

#మెగాస్టార్ 154కి చిరంజీవికి అనేక చార్ట్ బస్టర్ ఆల్బమ్ లను అందించిన రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఆర్థర్ ఎ విల్సన్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. ఎడిటర్ గా నిరంజన్‌ దేవరమానె.. ప్రొడక్షన్‌ డిజైనర్ గా ఎఎస్‌ ప్రకాష్‌ పని చేస్తున్నారు. సుస్మిత కొణిదెల కాస్ట్యూమ్ డిజైనర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. బాబీ స్వయంగా కథ- మాటలు రాయగా.. కోన వెంకట్, .. కె చక్రవర్తి రెడ్డి స్క్రీన్‌ప్లే రాశారు. రైటింగ్ డిపార్ట్ మెంట్ లో హరి మోహన కృష్ణ -వినీత్ పొట్లూరి కూడా ఉన్నారు. ఈ చిత్రానికి వాల్టేర్ వీర‌న్న .. వాల్టేర్ శీను అనే టైటిల్స్ ప‌రిశీల‌న‌లో ఉన్నాయ‌న్న టాక్ వినిపించింది. అధికారికంగా టైటిల్ ని ప్ర‌క‌టించాల్సి ఉంది.