Begin typing your search above and press return to search.

హిందీ ప‌రిశ్ర‌మ యంగ్ హీరోకి చిరంజీవి ఆశీస్సులు

By:  Tupaki Desk   |   30 Nov 2022 3:30 AM GMT
హిందీ ప‌రిశ్ర‌మ యంగ్ హీరోకి చిరంజీవి ఆశీస్సులు
X
2012లో 'విక్కీ డోనర్' చిత్రంతో తెరంగేట్రం చేసి ప్ర‌జ‌ల‌ హృదయాలను గెలుచుకున్న బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా పరిచయం అవసరం లేదు. తన అద్భుతమైన న‌ట‌నా నైపుణ్యం మధురమైన స్వ‌రంతో ఆయుష్మ‌న్ ప్రేక్షకులను ఆశ్చర్యపరచడంలో ఎప్పుడూ విఫలం కాలేదు. బాలీవుడ్ కేవ‌లం న‌ట‌వార‌సుల‌కు మాత్ర‌మే అనుకునే రోజుల్లోను ఎలాంటి సినీనేప‌థ్యం లేకుండా స్వ‌యంకృషితో ప‌రిశ్ర‌మ‌లో ఎదిగిన హీరోగా ఆయుష్మాన్ కి ప్ర‌త్యేక గుర్తింపు ఉంది. విల‌క్ష‌ణ‌మైన క‌థ‌లు స్క్రిప్టుల‌ ఎంపిక‌ అత‌డిని స్వీయ నిర్మిత హీరోగా నిల‌బెట్టాయంటే అతిశ‌యోక్తి కాదు.

మెగాస్టార్ చిరంజీవితో ఒకే ఫ్రేమ్ లో గత రాత్రి (నవంబర్ 29) ఆయుష్మాన్ ఖురానా ఇన్ స్టాలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవితో క‌లిసి ఒకే ఫ్రేమ్ లో ఉన్న అరుదైన ఫోటోని షేర్ చేసారు. ఈవెంట్ నుండి ఒక‌ అందమైన స్నాప్ ను షేర్ చేస్తూ.. ఆయుష్మాన్ ఒక స్వీట్ నోట్ ను రాసాడు. "గోవా ఇఫీ ఉత్స‌వాల్లో నా సన్మానం కోసం.. అలాగే నా #AnActionHero మూవీ ప్రమోషన్ కోసం వ‌చ్చాను. నేను ఇక్క‌డ‌ ఎవరిని కలిశానో చూడండి? మెగాస్టార్ చిరంజీవి గారు .. వారి ఆశీర్వాదం కోరాను!" అంటూ సంబ‌రంగా ఆ ఫోటోని షేర్ చేసారు.

అతడు ఈ ఫోటోని షేర్ చేసిన‌ వెంటనే మెగాభిమానుల నుంచి సోష‌ల్ మీడియాల్లో అసాధార‌ణ స్పంద‌న‌లు పోటెత్తాయి. రెండు వేర్వేరు సినీ పరిశ్రమల‌లోని ప‌వర్ హౌస్ ల క‌లయిక ఇది అంటూ కీర్తించారు. ఆ ఇద్ద‌రినీ ఇలా చూశాక‌ అభిమానులు తమ ఉత్సాహాన్ని నియంత్రించుకోలేకపోయారు. "ఒకే ఫ్రేమ్ లో ఇద్దరు గొప్ప నటులు" అంటూ ఒక నెటిజ‌నుడు ప్ర‌శంసించారు. మరొకరు "ఇద్ద‌రు స్వీయ-నిర్మిత స్టార్లు" అని వ్యాఖ్య‌ను జోడించారు.

వాస్త‌వానికి టాలీవుడ్ లో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా అంచెలంచెలుగా ఎదిగిన కొణిదెల శివశంక‌ర వ‌ర ప్ర‌సాద్ (చిరంజీవి)తో ఇలా ఒకే ఫ్రేమ్ లో క‌నిపించే అదృష్టం ఆయుష్మాన్ కి ద‌క్కింది. ఇక ముందు టాలీవుడ్ లో అత‌డి ఎంట్రీకి.. ద‌క్షిణాది రంగ ప్ర‌వేశానికి.. పాన్ ఇండియా హీరోగా ఎదుగుద‌ల‌కు కూడా ఇది బాట‌లు వేసేందుకు అవ‌కాశాన్ని క‌ల్పిస్తుంద‌న‌డంలో సందేహం లేదు. ఆయుష్మాన్ టాలీవుడ్ మెగా యువ‌హీరోల‌తో క‌లిసి న‌టిస్తే అది క‌చ్ఛితంగా పాన్ ఇండియా రీచ్ ని క‌లిగి ఉంటుంది. అది ఇరు వ‌ర్గాల‌కు లాభించే అంశంగాను మారొచ్చు.

ఆయుష్మాన్ న‌టించిన తాజా చిత్రం 'యాన్ యాక్ష‌న్ హీరో' గురించి మాట్లాడుతూ.. జైదీప్ అహ్లావత్ తన సోదరుడి ఆక‌స్మిక‌ రహస్య మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకునే భురా సోలంకి పాత్రలో అలాగే ప్రాణం కోసం పరిగెత్తే యాక్షన్ హీరో మానవ్ పాత్రలో ఆయుష్మాన్ నటించారు. రెండు షేడ్స్ ఉన్న పాత్ర‌ల‌తో అత‌డు మెప్పించ‌నున్నాడు.

ఇంత‌కుముందు 'బదాయి హో' లాంటి వైవిధ్య‌మైన చిత్రంతో ఆక‌ట్టుకున్న ఆయుష్మాన్ 'యాన్ యాక్షన్ హీరో'లో తన పాత్ర చాలా ప్ర‌త్యేకంగా ఉంటుంద‌ని వెల్ల‌డించాడు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ "ఇది నాకు ఒక జానర్ బ్రేకర్. ఇది నా ఎంపిక‌ల్లో ప్రధాన సామాజిక కామెడీ సినిమాల‌ శైలికి భిన్నంగా ఉంటుంది. ఇందులో ఎలాంటి సందేశం లేదు. స్వచ్ఛమైన థ్రిల్స్ తో ఆక‌ట్టుకుంటుంది. ఇది నాకు రోలర్ కోస్టర్ రైడ్" అని అన్నారు. ఈ చిత్రం ఒక సాధారణ పరిస్థితిలో ఉన్న అసాధారణ వ్యక్తి (ఇండియా బిగ్గెస్ట్ హీరో) గురించిన క‌థ‌తో తెర‌కెక్కింది. పగ తీర్చుకోవడం అనే ఎమోషన్ మామూలు విషయమే కానీ ఒక సూపర్ స్టార్ అలాంటి సాధారణ పరిస్థితిలో ఉంటే అతను ఆ స‌న్నివేశాన్ని ఎలా ఎదుర్కొన్నాడు? అనేదే ఆస‌క్తి క‌లిగించే థీమ్.. అని తెలిపాడు.

ఇటీవ‌లే రకుల్ ప్రీత్ సింగ్ తో క‌లిసి 'డాక్టర్ జి' లో అందరినీ ఆశ్చర్యపరిచిన ఈ విల‌క్ష‌ణ న‌టుడు ప్రస్తుతం అనిరుధ్ అయ్యర్ యాన్ యాక్షన్ హీరోతో హిట్ కొడ‌తాన‌ని ధీమాను వ్య‌క్తం చేసాడు. ప్రస్తుతం అనన్య పాండేతో కలిసి డ్రీమ్ గర్ల్ 2లో కూడా ఆయుష్మాన్ న‌టిస్తున్నాడు. ఆయుష్మాన్ న‌టించే మెజారిటీ సినిమాల‌ను తెలుగు చిత్ర నిర్మాత‌లు రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.