Begin typing your search above and press return to search.

'ఎన్టీఆర్'కి మెగాస్టార్ విషెస్.. ఏమన్నారంటే?

By:  Tupaki Desk   |   20 May 2020 11:34 AM GMT
ఎన్టీఆర్కి మెగాస్టార్ విషెస్.. ఏమన్నారంటే?
X
జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మే 20న అంటే ఈరోజు అభిమానులతో పాటు సెలబ్రిటీల నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. 'ఆర్ఆర్ఆర్' సినిమా బృందం ఏదైనా ఎన్టీఆర్ సర్ప్రైజ్ వీడియో లేదా ఫస్ట్ లుక్ విడుదల చేస్తుందని అభిమానులంతా కోటి ఆశలతో ఎదురు చూసినందుకు తీవ్ర నిరాశ తప్పలేదు. టీజర్ లాంటి వీడియో, ఫస్ట్ లుక్ పోస్టర్ రూపొందించడం వీలు కాలేదని.. ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఎలాంటి టీజర్ రిలీజ్ చేయడం లేదని ఆర్ఆర్ఆర్ చిత్రయూనిట్ ప్రకటించి షాక్ ఇచ్చారు. తర్వాత అభిమానులను ఉద్దేశించి.. "మీ ఆనందం కోసం ఫస్ట్ లుక్-టీజర్ సిద్ధం చేయాలని చిత్రబృందం ఎంత శ్రమించిందో నాకు తెలుసు. కానీ ఓ ప్రమోషనల్ వీడియో మీ ముందు ఉండాలంటే అన్ని సాంకేతిక విభాగాలు సమన్వయంతో పనిచేయాలి. లాక్ డౌన్ కారణంగా అది సాధ్యపడలేదు. అందుకే ఆర్ఆర్ఆర్ చిత్రం నుంచి ఎలాంటి ఫస్ట్ లుక్, టీజర్ విడుదల కావడం లేదు' అంటూ సోషల్ మీడియాలో తెలిపారు.

కానీ నిన్న సాయంత్రం నుండే ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు మొదలైపోయాయి. ఎందుకంటే.. ఎన్టీఆర్ పర్సనల్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్.. ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ ఫోటోతో సర్ప్రైజ్ ఇచ్చి అభిమానులను ఖుషి చేసాడు. ఇక అప్పటి నుండి సెలెబ్రేషన్స్ మొదలు.. ఈరోజు ఉదయం నుండి టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు సెలబ్రిటీలంతా ఎన్టీఆర్ కి శుభాకాంక్షలు తెలుపుతూనే ఉన్నారు. ఇక టాలీవుడ్ మెగాస్టార్ కూడా ఎన్టీఆర్ ని ట్విట్టర్ వేదికగా ఆశీర్వదించారు. "పుట్టినరోజు శుభాకాంక్షలు తారక్. నీ కలలన్ని సాకారం కావాలని మనసారా కోరుకుంటున్నాను" అంటూ విష్ చేసి తారక్ కి సర్ప్రైజ్ ఇచ్చారు. ఇక ఈరోజుతో ఎన్టీఆర్ తన 36వ యేట నుండి 37లోకి అడుగు పెడుతున్నాడు. ఇక చిరంజీవితో సహా టాలీవుడ్ సెలబ్రిటీలంతా విష్ చేస్తున్నారు. ప్రస్తుతం మెగాస్టార్ ట్వీట్ వైరల్ అవుతోంది.