Begin typing your search above and press return to search.

హైట్‌ లోనే కాదు అన్నింటా మించి పోవాలి: చిరు

By:  Tupaki Desk   |   8 April 2020 2:00 PM IST
హైట్‌ లోనే కాదు అన్నింటా మించి పోవాలి: చిరు
X
పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ కొడుకు అకీరా పుట్టిన రోజు నేడు. ఈ సందర్బంగా సోషల్‌ మీడియాలో హ్యాపీ బర్త్‌ డే అకీరా అంటూ పెద్ద ఎత్తున ట్రెండ్‌ అవుతున్న విషయం తెల్సిందే. ఇక సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌ గా ఉంటున్న చిరంజీవి కూడా అకీరా పుట్టిన రోజున శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్బంగా చిరు.. మన బిడ్డ మనకంటే ఎత్తుకు ఎదగాలని కోరుకుంటాం. నా చేతిలో ఒదిగి పోయిన ఈ బిడ్డ ఎత్తులో అందరికంటే ఎదిగి పోయాడు(6.4). అన్ని విషయాల్లోనూ ఇలాగే అందరిని మించిపోవాలి. విష్‌ యూ పవర్‌ ఫుల్‌ ఫ్యూచర్‌. హ్యాపీ బర్త్‌ డే అంటూ పోస్ట్‌ చేశారు.

నేడు అల్లు అర్జున్‌ బర్త్‌ డే కూడా అవ్వడంతో చిరంజీవి అల్లుడు అల్లు అర్జున్‌ గురించి కూడా ట్వీట్‌ చేశాడు. బన్నీ చిన్నప్పుడు డాన్స్‌ చేస్తున్న ఫొటోను షేర్‌ చేసి ఆ వయసు నుండే బన్నీ కి డాన్స్‌ లో గ్రేస్‌ ఉండేది. నాకు అతడి కష్టపడే తత్వం ఇంకా సినిమా పై పాషన్‌ ఇష్టం. హ్యాపీ బర్త్‌ డే బన్నీ నీవు బాగుండాలబ్బా అంటూ ట్వీట్‌ చేశాడు. ప్రస్తుతం అల్లు అర్జున్‌ పుష్ప చిత్రంలో రాయలసీమ యాసలో మాట్లాడబోతున్నాడు. అందుకే ఆ విషయాన్ని దృష్టి లో ఉంచుకుని నీవు బాగుండాలబ్బా అంటూ పోస్ట్‌ చేసి తన సమయ స్ఫూర్తిని చాటుకున్నాడు.

ఇక నేడు అఖిల్‌ పుట్టిన రోజు కూడా ఉండటంతో చిరంజీవి ట్విట్టర్‌ లో నాగార్జున అఖిల్‌ తో తాను కలిసి ఉన్న ఒక పాత ఫొటోను షేర్‌ చేసి.. హ్యాపీ బర్త్‌ డే అఖిల్‌. చరణ్‌ కి ఒక తమ్ముడు సురేఖకి నాకు ఒక కొడుకు మాదిరి. మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్‌ అండ్‌ మోస్ట్‌ లవ్డ్‌ కిడ్‌. నీకు రాబోయే ఏడాది మంచి జరగాలని కోరుకుంటున్నాను అంటూ ట్వీట్‌ చేశాడు.

మొత్తానికి ఈ రోజు చాలా ప్రత్యేకం అంటూ చిరంజీవి రెండు రోజులుగా చెబుతూ ఇలా వరుసగా నేడు ముగ్గురికి ప్రత్యేకంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశాడు. చిరంజీవి ట్వీట్స్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతున్నాయి.