Begin typing your search above and press return to search.

ట్విట్టర్ రికార్డులు బద్దలు కొడతాం అంటున్న మెగాఫ్యాన్స్.. అందుకేనా..??

By:  Tupaki Desk   |   18 July 2020 8:30 AM IST
ట్విట్టర్ రికార్డులు బద్దలు కొడతాం అంటున్న మెగాఫ్యాన్స్.. అందుకేనా..??
X
ప్రస్తుత కాలంలో సినీ తారలంతా ఫేస్బుక్, ఇంస్టాగ్రామ్, ట్విట్టర్ అంటూ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు దగ్గరవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ముఖ్యంగా మన తెలుగు సినీ హీరోలు, హీరోయిన్లు అంతా కూడా ఏదొక మీడియా మాధ్యమంలో ఎప్పటికప్పుడు యాక్టీవ్ గా ఉంటుంటారు. వారి అభిమానులతో పంచుకోవాల్సిన విషయాలను పంచుకుంటారు. దాదాపుగా చిన్న హీరోల దగ్గరనుండి సీనియర్ హీరోల వరకు అందరూ ఫ్యాన్స్ తో కాంటాక్ట్ లో ఉంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఈరోజు ఉగాది పండుగ సందర్భంగా సోషల్ మీడియాలోకి ఎంటరయ్యారు. ట్విట్టర్ వేదికగా ఆయన అకౌంట్ క్రియేట్ చేసారు.

మెగాస్టార్ ఇంతకాలం తన అభిమానులకు ఆడియో లాంచ్ లలో, సినిమా వేడుకల్లో తప్ప ఎక్కడ కూడా కనిపించేవారు కాదు. ఇప్పుడు చిరంజీవి ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేయగానే లక్షల్లో అభిమానులు ఆయనను ఫాలో అవ్వడం మనం గమనించవచ్చు. అయితే మెగాస్టార్ సోషల్ మీడియాలో ఖాతా తెరవడం అభిమానులకు పెద్ద పండుగే అయిపోయింది. సరిగ్గా ఉగాది పర్వదినాన ట్విట్టర్ లో 'చిరంజీవి కొణిదెల' పేరుతో అకౌంట్ ఓపెన్ చేశారు. అకౌంట్ ఓపెన్ చేసిన వెంటనే అభిమానులను ఉద్దేశించి మెగాస్టార్.. ఈ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో మాట్లాడడం ఆనందంగా ఉందని తన సంతోషాన్ని వెలిబుచ్చిన సంగతి తెలిసిందే.

అయితే వచ్చే నెల అంటే ఆగష్టు 22న మెగాస్టార్ చిరు పుట్టినరోజు. ఈ సందర్బంగా ట్విట్టర్ లో ఈ మధ్య రికార్డుల గోల ట్రెండ్ అవుతోంది. అభిమానులు తమ హీరోల హ్యాష్ ట్యాగ్ లతో, కామన్ డీపీలతో హోరెత్తిస్తారు. ఇప్పటికే మహేష్ బాబు, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, రాంచరణ్ లాంటి హీరోల ఫ్యాన్స్ రికార్డులు నెలకొల్పారు. అయితే మెగాస్టార్ ఫ్యాన్స్ మాత్రం ఓ రేంజిలో ట్విట్టర్లో హల్చల్ చేయాలనీ ఫిక్స్ అయ్యారట. మెగాస్టార్ కామన్ డీపీని ఓ ప్రముఖ సెలబ్రిటీ చేత లాంచ్ చేయనున్నారని సమాచారం. అలాగే మెగాస్టార్ పై ఓ స్పెషల్ సాంగ్ కూడా విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. చూడాలి మరి మెగాస్టార్ ట్విట్టర్ రికార్డులు ఏ రేంజిలో నమోదు అవుతాయో..!