Begin typing your search above and press return to search.
హేయ్.. 'ఆటో జానీ' వచ్చేస్తున్నాడంట
By: Tupaki Desk | 9 July 2016 11:14 PM ISTఅప్పట్లో పూరి జగన్ డైరక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి ''ఆటో జాని''గా మారుతున్నారంటే అందరూ ఎక్సయిట్ అయిపోయారు. అదే 150వ సినిమా అన్నారు. రామ్ చరణ్ స్వయంగా ఎనౌన్స్ చేశాడు కూడా. కాని చివరకు సెకండాఫ్ నచ్చకపోవడంతో ఈ సినిమా కాల్ ఆఫ్ చేశారు. మరి 150వ సినిమాను లేట్ చేయడం ఇష్టం లేక వెంటనే 'కత్తి' రీమేక్ ను వివి వినాయక్ డైరక్షన్లో మొదలెట్టారు.
ఇదే విషయంపై స్పందించిన పూరి.. నేను 150 కాకపోతే 151 లేకపోతే 163వ సినిమా అయినా చేస్తాను ఆయనతో అన్నాడు. ఇంతలో చిరంజీవి చెప్పినట్లు ఆటో జాని సెకండాఫ్ బాగాలేదు అనుకున్నాడేమో కాని.. వెంటనే దాని మీద వర్కవుట్ చేయడం మొదలెట్టాడు. ఓ ఆర్నెల్లకు ఒక కొత్త సెకండాఫ్ ను తయారు చేశాడు. అదే కథను ఇప్పుడు చిరంజీవికి వినిపిస్తే.. వావ్ అన్నారట. 150వ సినిమా పూర్తవ్వగానే ఈ సినిమాను అఫీషియల్ గా ప్రకటించే ఛాన్సున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి మెగాస్టార్ ను డైరక్ట్ చేయాలనే కోరికను పూరి అలా తీర్చుకుంటున్నాడనమాట.
ఇకపోతే మెగా150 సినిమా తొలి షెడ్యూల్ పూర్తయినట్లు టాక్. కొత్త షెడ్యూల్ మొదలయ్యేలోపు మనోళ్ళు మరి సినిమా కోసం ఒక హీరోయిన్ ను సెలక్ట్ చేసుకుంటారా?
