Begin typing your search above and press return to search.
ఆ మెగా క్లాష్ ను భలే మేనేజ్ చేశారు
By: Tupaki Desk | 25 Jun 2018 9:46 AM ISTటాలీవుడ్ లో ఎక్కువమంది హీరోలుంది మెగా కాంపౌండ్ లోనే. వీరిలో యంగ్ హీరోలంతా వరసగా సినిమాలు చేస్తూ వస్తున్నారు. దీంతో మెగా హీరోల మధ్య ఒకోసారి అనుకోకుండానే క్లాష్ వచ్చేస్తోంది. ఫ్యామిలీలో ఇద్దరు హీరోల సినిమాలు ఒకేరోజు రిలీజ్ కావడాన్ని చిరు మొదటి నుంచి వ్యతిరేకిస్తూనే ఉన్నారు.
తాజాగా చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్.. మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ల సినిమాలకు డేట్స్ క్లాష్ తలెత్తే పరిస్థితి వచ్చింది. వీళ్లిద్దరి లేటెస్ట్ మూవీస్ విజేత.. తేజ్ ఐ లవ్ యూ జులై 6న రిలీజ్ చేయాలని నిర్మాతలు రెడీ అయ్యారు. ఈ పోటీపై మెగాభిమానుల్లో కాస్తంత ఆందోళన వ్యక్తమైంది. దీనిపై చిరు జోక్యం చేసుకోవాలని వారు కోరుకున్నారు. అనుకున్నట్టుగా ఈ ఇష్యూను చిరు చక్కగా మేనేజ్ చేశాడు. విజేత సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్లో దీనిపై క్లారిటీ ఇచ్చాడు. అల్లుడు కళ్యాణ్ దేవ్ విజేత జులై 12న వస్తుందని అనౌన్స్ చేశాడు.
మెగా ఫ్యామిలీలో ఇద్దరు హీరోల మధ్య పోటీ ఉండకూడదని విజేత నిర్మాత కొర్రపాటి సాయి మూవీని 12న రిలీజ్ చేయడానికి ముందుకొచ్చారంటూ వేదికపై చిరు చెప్పుకొచ్చాడు. ఏదో చెప్పడానికి నిర్మాత సాయి పేరు చెప్పాడు కానీ అల్లుడు.. మేనల్లుడు మధ్య క్లాష్ లేకుండా చిరంజీవి చక్కగా సెట్ చేశాడని అభిమానులకు ఇట్టే అర్ధమైపోతోందిలే.