Begin typing your search above and press return to search.

త‌లైవాకి మెగా టైటిల్ సెంటిమెంట్!

By:  Tupaki Desk   |   25 Feb 2020 6:00 PM IST
త‌లైవాకి మెగా టైటిల్ సెంటిమెంట్!
X
ఒక ఫార్ములా హిట్ అయితే అదే ట్రెండ్. టాలీవుడ్ లో ఈ సూత్రం చాలా బాగా ప‌నిచేస్తుంది. హిట్ సినిమాల టైటిల్స్ రిపీటైతే అది పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేస్తుంద‌నో.. లేదా ఎవ‌రైనా ఫేమ‌స్ హీరో టైటిల్ పెట్టుకుంటే సినిమా ప‌బ్లిసిటీ ప‌రంగా క‌లిసొస్తుంద‌నో ఆ త‌ర‌హా ఫార్ములాని అనుసరిస్తుంటారు.

ఇప్ప‌టికే మెగాస్టార్ చిరంజీవి హిట్ సినిమాల‌ టైటిల్ తో హిట్లు కొట్టారు సూర్య త‌మ్ముడు కార్తీ.. బెల్లంకొండ శ్రీ‌ను. ఇపుడు అదే సూత్రాన్ని సూప‌ర్ స్టార్ ర‌జ‌నీ కాంత్ ఫాలో అవుతున్నార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ద‌రువు శివ ర‌జ‌నీకాంత్ తో త‌మిళంలో చేయ‌బోయే సినిమాకి మెగాస్టార్ టైటిల్ నే ఖాయం చేస్తున్నార‌ట‌. అన్న‌తే అనేది త‌మిళ టైటిల్. దానినే తెలుగులో అన్న‌య్య‌గా పెడ‌దామ‌ని వీర‌మ్- విశ్వాసం డైర‌క్ట‌ర్ యోచిస్తున్నారు. మూవీ టీం దీనిపై సీరియ‌స్ గానే వ‌ర్క‌వుటు చేస్తోంద‌ట‌.

2000లో వ‌చ్చిన అన్న‌య్య చిరుకి మంచి పేరు తీసుకొచ్చింది. సెంటిమెంట్ తో పాటు కామెడీ ఎంట‌ర్ టైనర్ గా అంద‌రినీ ఆక‌ట్టుకుంది. అంతేకాదు ఈ సినిమాలో త‌మ్ముడిగా న‌టించిన ర‌వితేజాకు మంచి పేరొచ్చింది. ర‌జ‌నీకాంత్ న‌టించే సినిమాకి చిరు టైటిల్ పెడితే.. హిట్ సెంటిమెంట్ వ‌ర్క‌వుట‌వుతుంద‌ని రిపీట‌వుతుంద‌ని ప్ర‌చారం చేసుకునే వీలుంటుంది. అయితే ఇది అన్నిసార్లు వ‌ర్క‌వుట‌య్యే ఫార్ములాయేనా అనేది చూస్తే.. చిరు న‌టించిన గ్యాంగ్‌ లీడ‌ర్ టైటిల్ తో వ‌చ్చిన నానీ స్ గ్యాంగ్ లీడ‌ర్ బాక్సాఫీస్ వ‌ద్ద స‌రిగా ఆడని సంగ‌తి తెలిసిందే. కంటెంటే ఇక్క‌డ ముఖ్యం. ర‌జ‌నీ సినిమాలో కంటెంట్ కి యాప్ట్ అనుకుంటేనే ఆ టైటిల్ పెట్టుకోవాలి. ప్ర‌స్తుతానికి ర‌జ‌నీ-శివ టీమ్ చిరు టైటిల్ వైపే మొగ్గు చూపిస్తార‌ని భోగ‌ట్టా.