Begin typing your search above and press return to search.

చిరంజీవి-నాగార్జున బెస్ట్ మూవ్ మెంట్స్!

By:  Tupaki Desk   |   8 Oct 2022 3:30 PM GMT
చిరంజీవి-నాగార్జున బెస్ట్ మూవ్ మెంట్స్!
X
మెగాస్టార్ చిరంజీవి-కింగ్ నాగార్జున మ‌ధ్య ప్రెండ్ షిప్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఇద్ద‌రు చాలా క్లోజ్ గా ఉంటారు. ఆ రెండు కుటుంబాలు అకేష‌న‌ల్ గానూ క‌లుస్తుంటాయి. రేర్ గా గెట్ టూ గెద‌ర్ పార్టీలు ఏర్పాటు చేసుకుంటారు. ఒక ఫ్యామిలీ హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే? మ‌రో ఫ్యామిలీ మొత్తం ఎంత‌గానో స‌హ‌క‌రిస్తుంది.

చిరంజీవి సినిమాకి నాగార్జున గెస్ట్ గా ఆర‌వ‌డం..నాగ్ సినిమాకి చిరంజీవి అతిధిగా రావ‌డం వంటివి స‌హ‌జంగానే చోటు చేసుకుంటాయి. ఆ రెండు కుటుంబాల మ‌ధ్య అంత‌టి అన్యోన్య‌త ఉంది. ఇక చిరు-నాగ్ ఇద్ద‌రు బిజినెస్ పార్ట‌న‌ర్స్ కూడా. ప‌లు వ్యాపారాల్లో క‌లిసి పెట్టుబ‌డులు పెడుతున్నారు. ఇద్ద‌రి బాండింగ్ ఈనాడి ఆనాటిది కాదు. కొన్ని ద‌శాబ్ధాలుగా ఇద్దరి మ‌ధ్య ఆ ర‌క‌మైస‌న రిలేష‌న్ షిప్ కొన‌సాగుతోంది.

తాజాగా ఇద్ద‌రికి సంబంధించిన ఓ క్లోజ్ మూవ్ మెంట్ ఒక‌టిప్పుడు నెట్టింట చ‌క్కెర్లు కొడుతోంది. ఓ సినిమా ఫంక్ష‌న్ కి చిరంజీవి-నాగార్జున‌-రమ్య‌కృష్ణ హాజ‌ర‌య్యారు. ఆ వేదిక శిల్ప‌క‌ళా వేదిక‌లా క‌నిపిస్తుంది. ముగ్గురు ప‌క్క‌ప్క‌నే కూర్చున్నారు. ర‌మ్య‌కృష్ణ‌..నాగార్జున‌కు మ‌ధ్య‌లో చిరంజీవి కూర్చున్నారు. ఇంత‌లో మ‌ధ్య‌లో యాంక‌ర్ వ‌చ్చి ర‌మ్య‌కృష్ణ‌ని ఓ క‌ష్ట‌మైన ప్ర‌శ్న అడుగుతుంది.

'మీరు న‌టించిన హీరోల్లో మీకు బాగా ఇష్ట‌మైన హీరో ఎవ‌రు? అని ర‌మ్య‌కృష్ణని అడిగితే ఏమ‌ని స‌మాధానం చెప్పాలో అర్ధం కాలేదు. ఆ స‌మ‌యంలో చిరంజీవి హాస్యాస్ప‌ద‌మైన స‌న్నివేశాన్ని క్రియేట్ చేసారు. చిరంజీవి న‌వ్వుతూ ముందుకు వొంగి నాగ్ పేరు సూచించేలా సంకేత‌మిచ్చారు. ఆ త‌ర్వాత నేను నేను అంటూ త‌ను తానే ప్రోజెక్ట్ చేసుకున్నారు.

ఆ త‌ర్వాత మ‌రోసారి నాగ్ వైపు వేలు చూపిస్తూ..ఇత‌నే అంటూ చెప్ప‌మ‌ని ఫోర్స్ చేసారు. మ‌రోవైపు నాగార్జున చిరంజీవివైపు వేలు చూపిస్తూ అత‌నే అంటూ సంకేతాన్ని పాస్ చేసారు. ఆ ర‌కంగా చిరు-నాగ్ ఎంత క్లోజ్ అన్న‌ది ఆ నాడే అర్ధ‌మైంది. ఎవ‌రూ ఫీల్ అవ్వ‌కూడ‌ద‌ని ఒక‌ర్ని ఒక‌రు వేలెత్తి చూపించుకుని ఒక‌రిపై మ‌రొక‌రు అభిమానాన్ని చాటుకున్నారు.

ఇక ర‌మ్య‌కృష్ణ అభిమాన హీరో ఎవ‌రు? అన్న‌ది త‌ర్వాత రివీల్ చేస్తాం. ఇప్పుడీ పాత వీడియో సోష‌ల్ మీడియాలో జోరుగా వైర‌ల్ అవుతోంది. అప్ప‌ట్లో సోష‌ల్ మీడియా లేదు కాబ‌ట్టి ఇలాంటి స‌రాదా మూవ్ మెంట్స్ ఎన్నో అభిమానులు మిస్ అయ్యారు. అయినా యూట్యూబ్స్ వాటిని ఇప్పుడు ఒక్కొక్క‌టిగా ఇలా త‌వ్వి తీయ‌డం విశేషం.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.