Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: అమ్మకు చిరు వందనం

By:  Tupaki Desk   |   14 May 2018 10:18 AM IST
ఫోటో స్టోరి: అమ్మకు చిరు వందనం
X
జీవితంలో ఎంత పైకెదిగినా ఎప్పటికీ అమ్మకు మాత్రం కొడుకే. అమ్మంటే అద్వితీయమైన బంధం.. అపురూపమైన అనుబంధం. కనిపెంచిన తల్లి ఆశీస్సులు అందుకోవడం గొప్ప వరం. అలాంటి అమ్మ గొప్పతనాన్ని గుర్తు చేసుకునే సందర్భం మదర్స్ డే. మెగాస్టార్ చిరంజీవి ఈసారి మదర్స్ డే అభిమానులందరిలో స్ఫూర్తి నింపేలా సెలబ్రేట్ చేసుకున్నాడు.

మదర్స్ డే సందర్భంగా తమ్ముడు నాగేంద్ర బాబు.. తోబుట్టువులిద్దరితో కలిసి చిరంజీవి తన తల్లికి శుభాకాంక్షలు చెప్పాడు. చిరు ఫ్యామిలీ ఫొటో అందరికీ సుపరిచితమైనదే అయినా చెల్లెళ్లు మాధవి.. విజయదుర్గలతో కలిసి కనిపించే ఈవెంట్లు తక్కువే. ఈసారి మాత్రం ఇద్దరు చెల్లెళ్లు.. తమ్ముడితో కలిసి అమ్మ ఆశీస్సులు తీసుకున్నారు. తల్లి అంజనాదేవికి శుభాకాంక్షలు చెబుతూ తోడబుట్టిన వారందరితో కలిసి గడిపిన మధుర క్షణాల గురుతుగా తీసుకున్న ఫొటోను అభిమానులకు షేర్ చేశారు.

ఈ ఫొటోలో ఉన్న వెలితి ఏమిటంటే ఈ ఫ్యామిలీ ఫొటో కంప్లీట్ గా లేకపోవడమే. అంజనాదేవి అయిదుగురు సంతానంలో చివరి వాడయిన పవన్ కళ్యాణ్ లేడు. పవర్ స్టార్ పవన్ కూడా వచ్చి ఉంటే ఈ ఫొటోకు మరింత నిండుదనం వచ్చేదని అభిమానులు ఫీలయ్యారు.