Begin typing your search above and press return to search.

చిరు 152 - అంతా రెడీనా

By:  Tupaki Desk   |   4 April 2019 6:14 PM IST
చిరు 152 - అంతా రెడీనా
X
ఏడాది కాలంగా సైరా తప్ప ఇంకో ప్రపంచం లేకుండా ఉన్న మెగాస్టార్ చిరంజీవి దాన్నుంచి బ్రేక్ తీసుకుని ప్రస్తుతం సతీ సమేతంగా జపాన్ లో హాలిడే ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. తిరిగి వచ్చాక క్షణం తీరిక లేకుండా సైరా బాలన్స్ షూటింగ్ లో బిజీ అయిపోతారు. విడుదల ఈ ఏడాది ఉంటుందా లేక వాయిదా వేస్తారా అనే విషయంలో క్లారిటీ లేనప్పటికీ ఫ్యాన్స్ మాత్రం దసరాకు వస్తుందన్న చరణ్ మాట మీదే నమ్మకం పెట్టుకున్నారు.

దీని సంగతి అలా ఉంచితే సైరా తర్వాత కొరటాల శివకు కమిట్ అయిన చిరు జూన్ నుంచే దాని షూటింగ్ లో పాల్గొనబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే చాలా నెలల నుంచి వెయిట్ చేస్తున్న కొరటాల శివ లొకేషన్స్ ని ఫైనల్ చేయడంతో పాటు చిరుకు జోడిని సెట్ చేయడంలో బిజీగా ఉన్నాడు. కంబ్యాక్ ఇచ్చాక చేసిన సినిమాల్లో వరసగా కాజల్ అగర్వాల్ నయనతార తమన్నా లాంటి క్రేజీ బ్యూటీస్ చేసిన తరుణంలో దీనికి సైతం మంచి ఛాయస్ ని వెతుకుతున్నట్టు తెలిసింది

అన్ని సవ్యంగా కుదిరితే ఈ చిరు 152 జూన్ లో షూటింగ్ మొదలుపెట్టుకుని వచ్చే ఏడాది వేసవి విడుదలను టార్గెట్ చేసుకుని వస్తుందట. ఒకవేళ డేట్ ఏది ఫిక్స్ చేసుకున్నా కొరటాల శివ చిరులు మాత్రం ఆరు నుంచి ఎనిమిది నెలల వ్యవధిలో మొత్తం ఫినిష్ చేయాలనీ డిసైడ్ అయినట్టు టాక్. పోస్ట్ ప్రొడక్షన్ కు సైతం తగినంత సమయం కేటాయించి సైరాకు దీనికి గ్యాప్ వచ్చేలా జాగ్రత్తలు తీసుకుంటారట. రామ్ చరణ్ తో పాటు కొరటాల శివ సన్నిహితుడు నిరంజన్ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరించబోతున్న ఈ మూవీకి ఎంత బడ్జెట్ పెట్టబోతున్నారు అనే వివరాలు మాత్రం ఇంకా బయటికి రాలేదు