Begin typing your search above and press return to search.
#CHIRU 152 రిలీజ్ తేదీ ఇదే
By: Tupaki Desk | 16 Dec 2019 12:23 PM ISTమెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా 152వ సినిమా విజయ దశిమి సందర్భంగా లాంఛనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ప్రారంభోత్సవం జరిగి దాదాపు రెండు నెలలు అవుతోంది. అయినా ఇప్పటివరకూ సినిమా రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లలేదు. ఇటీవలే అందాల త్రిషను కథానాయికగా ఎంపిక చేసారు. బ్యాలెన్స్ ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తిచేసి 2020లో సెట్స్ కు వెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ తెలిసింది. సినిమా చిత్రీకరణ సహా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తిచేసి 2020 ఆగస్టు 14న రిలీజ్ చేయాలని కొణిదెల కాంపౌండ్ ప్లాన్ చేసిందట. అందుకు తగ్గట్టే దర్శకుడు కొరటాల షెడ్యూల్స్ ని ఫిక్స్ చేశారని తెలుస్తోంది.
ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అంతకు ఒకరోజు ముందు ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తే బాగుంటుందని కొరటాల భావిస్తున్నారట. ఇప్పటికే కథాంశం రాజకీయం.. నక్సలిజం అంశాలతో ముడిపడినది అన్న ప్రచారం ఉంది. దేవాలయ భూముల స్కామ్.. దేశభక్తి నేపథ్యం ఉందన్న వార్తా వేడెక్కిస్తోంది. ఈ పాయింట్ తోనే ఇండిపెండెన్స్ డే రిలీజ్ కనెక్షన్ ప్లాన్ చేశారని భావిస్తున్నారు. వాస్తవానికి మెగాస్టార్ 151వ చిత్రం సైరా నరసింహారెడ్డిని ఆగస్టు 14న రిలీజ్ చేయాలనుకున్న సంగతి తెలిసిందే. కానీ షూటింగ్ డిలే .. పాన్ ఇండియా మూవీ సాహో రిలీజ్ లాంటి కారణాలతో సైరాని వాయిదా వేసారు. అలా చిరు ఆగస్ట్ 14 రిలీజ్ ఛాన్స్ ని కోల్పోయారు.
కానీ ఈసారి మాత్రం 152వ చిత్రాన్ని ఆ తేదీకే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తే బాగుంటుందని ఆయన ఆసక్తిని కనబరిచారట. జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ కి వెళుతున్నారు కాబట్టి చిత్రీకరణ వేగంగానే పూర్తయ్యే అవకాశాలున్నాయి. షూటింగ్ .. పీపీ వర్క్ ఒకే సారి నడిపిస్తారు కాబట్టి ఈసారి మాత్రం ఆలస్యం అయ్యేందుకు అకాశం లేదు. అన్నీ అనుకున్నట్లు గనుక జరిగితే మెగాస్టార్ సందడి ఇండిపెండెన్స్ డే కి ఒక రోజు ముందే ఖాయం అవుతుందన్నమాట.