Begin typing your search above and press return to search.
ఆచార్య దెబ్బకు అంత వెనక్కిచ్చారా?
By: Tupaki Desk | 13 Oct 2022 5:42 PM ISTమెగాస్టార్ చిరంజీవి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన మొదటి సినిమా ఆచార్య బాక్సాఫీస్ వద్ద ఎలాంటి నష్టాలను కలుగజేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక విధంగా ఇండియా మొత్తంలో పెట్టిన పెట్టుబడికి అత్యధిక స్థాయిలో నష్టాలను కలుగజేసిన టాప్ సినిమాల్లో ఇది కూడా ఒకటి. ముఖ్యంగా తెలుగులో అయితే ఇదే అతి పెద్ద డిజాస్టర్ గా కూడా మాట్లాడుకున్నారు.
అయితే ఈ దెబ్బతో చాలావరకు డిస్ట్రిబ్యూటర్ లు నష్టపోవాల్సి వచ్చింది. ఇక చేసేదేమీ లేక చివరికి దర్శకుడు కొరటాల శివ చాలా వరకు నష్టాలను పూరించే విధంగా డిస్ట్రిబ్యూటర్లకు కొంత డబ్బు వెనక్కి తిరిగి ఇచ్చినట్లు కూడా ఆ మధ్య ఒక టాక్ అయితే వినిపించింది. ఎందుకంటే తీవ్ర స్థాయిలో నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లు ఎక్కువగా కొరటాలు శివ ఆఫీస్ దగ్గర బైటాయించారని కూడా వార్తలు వచ్చాయి.
అయితే ఆ విషయంపై ఎవరూ పెద్దగా క్లారిటీ ఇవ్వలేదు. ఇక అంతకుముందే హీరోలు ఇద్దరు కూడా రెమ్యునరేషన్ తీసుకోలేదు అనే విధంగా నిర్మాత అధికారికంగా తెలియజేశారు. అయితే రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాకు దాదాపు 80 శాతం పారితోషికం వెనక్కి ఇచ్చినట్లు చెప్పారని మీడియాలో అయితే ప్రచారాలు జరుగుతున్నాయి.
ఎక్కువగా దర్శకుడి పైన ప్రభావం పడటంతో మెగాస్టార్ ప్రత్యేకంగా చొరవ తీసుకుని డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ కూడా సెటిల్మెంట్ చేసినట్లుగా వార్తలు చాలా వచ్చాయి. ఇక ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఇలా చెప్పినట్లుగా మళ్లీ జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇప్పుడు గాడ్ ఫాదర్ సినిమా అయితే సక్సెస్ అయినట్లు చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.
కానీ ఈ సినిమాకు కూడా కొంత నష్టాలు వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది. చిత్ర యూనిట్ సభ్యులైతే రోజు ఏదో ఒక విధంగా ప్రమోషన్స్ అయితే చేస్తున్నారు. ఇప్పటివరకు సినిమా పెట్టిన పెట్టుబడిలో ఇంకా పూర్తిస్థాయిలో వెనక్కి తీసుకురాలేదు. లాభాల సంగతి పక్కన పెడితే నష్టాలు రాకుండా ఉంటే చాలు అనే పరిస్థితికి సినిమా వచ్చేసింది. మరి గాడ్ ఫాదర్ ఎంతవరకు నిలదొక్కుకుంటుందో చూడాలి.