Begin typing your search above and press return to search.

అతడు ఒప్పుకోవడంతోనే 'ఉప్పెన' సక్సెస్‌ కొట్టిందిః చిరంజీవి

By:  Tupaki Desk   |   7 Feb 2021 3:46 AM GMT
అతడు ఒప్పుకోవడంతోనే ఉప్పెన సక్సెస్‌ కొట్టిందిః చిరంజీవి
X
ఉప్పెన మూవీ ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక వైభవంగా జరిగింది. మెగా స్టార్‌ చిరంజీవి తన చిన్న మేనల్లుడు వైష్ణవ్‌ తేజ్ ను ఆశీర్వదించేందుకు వచ్చారు. ఉప్పెన సినిమాలో హీరోయిన్‌ తండ్రి పాత్రలో తమిళ స్టార్‌ నటుడు విజయ్ సేతుపతి నటించారు. ప్రీ రిలీజ్ వేడుకలో పాల్గొన్న ప్రతి ఒక్కరు మాట్లాడిన సందర్బంగా విజయ్‌ సేతుపతి గురించి మాట్లాడారు. ఆయన గొప్ప నటుడు అంటూ ప్రశంసలు కురిపించారు. తెలుగులో మీరు మరిన్ని సినిమాలు చేయాలని ప్రతి ఒక్కరు కోరుకుంటూ ఆయన్ను ఆకాశానికి ఎత్తేశారు. అందరు అన్నది వేరు మెగాస్టార్‌ అన్నది వేరు అన్నట్లుగా విజయ్‌ సేతుపతి గురించి చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఆయన రేంజ్‌ ను మరింతగా పెంచేశాయి.

వేడుకలో చిరంజీవి మాట్లాడుతూ.. మానవత్వం ఉన్న వ్యక్తి మక్కల్ సెల్వన్‌ విజయ్‌. దేశంలోని అద్బుతమైన నటుల్లో ఒక్కరు. తమిళంలోనే కాకుండా దేశం మొత్తం ఆధరణ ఉన్న నటుడు. అలాంటి వ్యక్తి హీరోగానే చేయవచ్చు. కాని మంచి పాత్రల్లో జీవించాలనే తపనతో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా కూడా చేస్తున్నారు. ఎలాంటి పాత్రను అయినా అవలీలగా చేయడంలో ఆయనకే చెల్లింది. ఇటీవల మాస్టర్‌ సినిమా చూశాను. అందులో భవానీ పాత్రలో అద్బుతంగా నటించాడు. హీరోకు ధీటుగా నటించాడు. నేను భవానీ పాత్రను లవ్‌ చేశాను. నా సైరా సినిమాలో పాత్ర నిడివి పక్కన పెట్టి ఒక మంచి పాత్ర చేయాలనే ఉద్దేశ్యంతో నటించాడు.

బుచ్చి బాబు ఈ కథ చెప్పిన సమయంలోనే హీరోయిన్‌ పాత్రకు విజయ్‌ సేతుపతిని అనుకుంటున్నట్లుగా చెప్పాడు. ఆశకు అయినా హద్దు ఉండాలి కదా అనుకున్నాను. అంత బిజీ ఆర్టిస్టు ఇక్కడ చేస్తాడా అనుకున్నాను. కాని బుచ్చి బాబు బలంగా కోరుకుని విజయ్‌ సేతుపతిని ఈ సినిమాలో నటింపజేశాడు. విజయ్‌ సేతుపతి ఈ సినిమాలో నటించడంకు ఒప్పుకున్న సమయంలోనే ఉప్పెన మొదటి సక్సెస్‌ ను దక్కించుకుంది. తప్పకుండా విజయ్‌ సేతుపతి పాత్ర ఉప్పెన సినిమాలో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందనే నమ్మకంను చిరంజీవి వ్యక్తం చేశారు. విజయ్ సేతుపతిపై మెగా స్టార్‌ చేసిన ప్రశంసలు ఆయన రేంజ్‌ ను మరింతగా పెంచాయి.