Begin typing your search above and press return to search.

152 కొర‌టాల‌.. 153 త్రివిక్ర‌మ్‌

By:  Tupaki Desk   |   9 Jan 2019 11:07 AM IST
152 కొర‌టాల‌.. 153 త్రివిక్ర‌మ్‌
X
చ‌ర‌ణ్- బోయ‌పాటిల‌ `విన‌య విధేయ రామ‌` జ‌న‌వ‌రి 11న ఘ‌నంగా రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్రీమియ‌ర్ల‌కు ఒక‌రోజు ముందే ఏర్పాట్లు సాగుతున్నాయి. ఏపీ, తెలంగాణ‌లోనూ భారీగా థియేట‌ర్ల‌ను బ్లాక్ చేశారు. ఆన్ లైన్ టికెటింగ్ హోరెత్తుతోంది. ఇక‌పోతే ఈ సినిమా ప్రచార కార్య‌క్ర‌మాల్లో రామ్ చ‌ర‌ణ్ ఒక్కో నిజం చెబుతూ బోలెడ‌న్ని షాక్ లు ఇచ్చారు. అందులో త‌న సినిమాతో పాటు, మెగాస్టార్ చిరంజీవి పారితోషికం గురించి, సైరా బ‌డ్జెట్ గురించి చెప్పారు. మెగాస్టార్ న‌టించే త‌దుప‌రి సినిమాల డేటా మొత్తం లీక్ చేశారు.

మెగాస్టార్ త‌దుప‌రి సినిమాలు .. అంటే 152, 153 చిత్రాలు వ‌రుస‌గా కొర‌టాల‌, త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతాయ‌ని స్ప‌ష్ట‌త‌నిచ్చారు. `మిర్చి` తర్వాత కొర‌టాల‌తో సినిమా చేయాలనుకుంటున్నాను. నాతో పనిచేస్తామని వచ్చిన ఆయనకు నేను కుద‌ర‌క‌పోయినా, నాన్నగారు దొరికారు. నాన్నగారి సినిమా తర్వాత కొరటాలతో నా సినిమా త‌ప్ప‌కుండా ఉంటుంది.. అని చ‌ర‌ణ్‌ అన్నారు. చిరు- కొర‌టాల సినిమా ఏప్రిల్ లో ప్రారంభ‌మ‌వుతుంది. అప్ప‌టికి సైరా టాకీ చిత్రీక‌ర‌ణ పూర్తి చేస్తారని క్లారిటీనిచ్చారు. ఈ చిత్రానికి చ‌ర‌ణ్ కూడా నిర్మాణ భాగ‌స్వామిగా కొన‌సాగుతున్నారు.

దీంతో `విన‌య విధేయ రామ‌` ట్రైల‌ర్ ఈవెంట్ లో అనూహ్యంగా వేదిక‌పై ప్ర‌త్య‌క్ష‌మైన త్రివిక్ర‌మ్ ని చూసి షాక్ తిన్న‌వాళ్లంద‌రికీ ఒక క్లారిటీ వ‌చ్చింది. ఇప్ప‌టివ‌ర‌కూ ఓ చిన్న క్లారిటీ మిస్స‌వుతోందే అనుకున్న‌వారికి పూర్తిగా స్ప‌ష్ట‌త వ‌చ్చేసింది. మెగాస్టార్ స్వ‌యంగా త్రివిక్ర‌మ్ ప్రాజెక్టును ప్ర‌క‌టించ‌డంతో అంద‌రిలో క‌న్ఫ్యూజ‌న్ కి దారి తీసింది. అయితే కొర‌టాల త‌ర్వాత‌నే త్రివిక్ర‌మ్ తో చిరు సినిమా ఉంటుంద‌ని చ‌ర‌ణ్ పూర్తి క్లారిటీనిచ్చిన‌ట్ట‌య్యింది. ఇక ఏపీలో 2019 ఎన్నిక‌ల హ‌డావుడి పూర్త‌యితే మెగాస్టార్ చిరంజీవి- ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ కాంబినేష‌న్ సినిమాకి టీఎస్సార్- అశ్వ‌నిద‌త్ స‌న్నాహాలు చేస్తున్నార‌న్న ప్ర‌చారం ఇప్ప‌టికే ఉంది.