Begin typing your search above and press return to search.

చిరు 150.. కొత్త డేటొచ్చింది

By:  Tupaki Desk   |   8 Dec 2015 8:06 AM GMT
చిరు 150.. కొత్త డేటొచ్చింది
X
అవును మళ్లీ సినిమాల్లోకి వస్తున్నా అని చిరంజీవి ప్రకటించి ఇప్పటికి ఏడాదిన్నర దాటిపోయింది. గత ఏడాది పుట్టిన రోజు దగ్గర్నుంచి ఇప్పటిదాకా ఎన్నో డెడ్ లైన్లు వచ్చాయి వెళ్లాయి. 150వ సినిమాపై ప్రకటన ఇదిగో అదిగో అంటూనే కాలం గడిచిపోతోంది. మొన్న దసరాకు అనౌన్స్ మెంట్ పక్కా అన్నారు. కానీ తర్వాత చిరు కానీ, చరణ్ కానీ పత్తా లేరు. అసలు మెగా కాంపౌండ్ నుంచి సౌండే లేదు. చిరుతో కత్తి రీమేక్ చేస్తాడనుకున్న వినాయక్ అసలు సినిమాల నుంచి లాంగ్ గ్యాప్ తీసుకునే ఆలోచనలో ఉన్నాడు. దీంతో ఇక చిరు-150 సంగతి తేలినట్లే అని నిట్టూరుస్తున్నారు అభిమానులు. మెగాస్టార్ రీఎంట్రీ గురించి మాట్లాడ్డానికే వారు ఆసక్తి చూపించట్లేదు.

ఐతే ఈ పరిస్థితుల్లో మళ్లీ చిరంజీవి రీఎంట్రీ మూవీ గురించి ఓ కొత్త కబురు వినిపిస్తోంది. సంక్రాంతి రోజు ఈ సినిమా గురించి ప్రకటన చేసే అవకాశమున్నట్లు చిరంజీవి అభిమానుల సంఘంలో కీలకంగా వ్యవహరించే వ్యక్తులు మీడియాకు సమాచారం ఇచ్చారు. వీరు చిరంజీవితో సన్నిహితంగా ఉండేవారే. అభిమానుల్లో గందరగోళానికి తావు లేకుండా ఉండేందుకు 150వ సినిమా విషయంలో కొంత కాలంగా చిరు సహా అందరూ సైలెంటుగా ఉన్నారని.. ఐతే ఓ పక్క ఆ పని జరుగుతోందని.. ఇంతకు మించి ఎక్కువ కాలం నాన్చితే జనాల్లో ఫ్రస్టేషన్ తారా స్థాయికి చేరుతుందన్న ఉద్దేశంతో సంక్రాంతికి ఎట్టి పరిస్థితుల్లో సినిమా గురించి ప్రకటన చేసి వెంటనే ప్రాజెక్టును పట్టాలెక్కించాలని భావిస్తున్నట్లు సమాచారం.