Begin typing your search above and press return to search.

మెగా 150.. ఇష్యూ సాల్వ్‌ అవుతోందా?

By:  Tupaki Desk   |   4 April 2016 11:57 AM IST
మెగా 150.. ఇష్యూ సాల్వ్‌ అవుతోందా?
X
మెగాస్టార్‌ చిరంజీవి విషయంలో అసలు ఏం జరుగుతోంది? అబ్బే ఆయన విషయంలో అంటే ఆయన పర్సనల్‌ లైఫ్‌ లో కాదండీ.. ఆయన రీ-ఎంట్రీ మూవీ విషయంలో అని. ఆయనకు ఎంతో దగ్గరైన వ్యక్తులు పరుచూరి సోదరులు. కాని వారే ఇప్పుడు ఒక రైటర్‌ ''కత్తి'' సినిమాను తనకు డబ్బులు ఇచ్చి సెటిల్‌ చేసుకోండా ముందుకు తీసుకెళ్లకూడదు అంటూ రైటర్ల సంఘంను అప్రోచ్‌ కావడంతో.. ఈ సినిమా తెలుగు రీమేక్‌ షూటింగ్‌ కు కూడా అనుమతి ఇవ్వకుండా.. ప్రొడక్షన్‌ అండ్‌ ఇతర క్రూ లతో మాట్లాడి.. నో-కోపరేషన్ నోటీస్‌ ఇప్పించేశారు.

ఇప్పుడిక చిరంజీవి స్వయంగా ''కత్తిలాంటోడు'' అనే వర్కింగ్‌ టైటిల్‌ తో ప్రొసీడ్‌ అవుతున్నట్లు చెప్పకనే చెప్పారు. అయితే ఈ సినిమా సెట్స్‌ మీదకు వెళ్లాలంటే మరి రైటర్‌ విషయం సాల్వ్‌ అవ్వాలిగా. ఇంతకీ ఆ విషయం సెటిల్ మెంటు స్టేజుకు చేరుకుందా లేదా? ఇప్పుడు అందరూ ఈ విషయం గురించే ఎదురు చూస్తున్నారు. కథ నాదే అంటూ ముందుకొచ్చిన సదరు రైటర్‌ తమిళ నిర్మాతలతో సెటిల్‌ చేసుకోవాలి కాని.. ఇక్కడ చిరంజీవి సినిమాను ఆపడం ఏంటి అంటూ కొందరు పెద్ద తలకాయాలు అంటుంటే.. ఎంతోకొంత చేతిలో పెట్టి.. సినిమా టైటిల్సులో మూల కథ అంటూ మనోడి పేరు వేసుకొని సెటిల్‌ చేసుకోండి సార్‌ అంటూ ఇంకొందరు చెప్పారట.

ఏదేమైనా మరో రెండు మూడు రోజుల్లో ఈ ఇష్యూ ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందట.