Begin typing your search above and press return to search.
సందిగ్ధంలో చిరంజీవి 150వ సినిమా?
By: Tupaki Desk | 14 Aug 2015 11:02 AM ISTమెగాస్టార్ చిరంజీవి నటించే 150వ సినిమా ఎప్పుడు మొదలవుతుంది? ముందే చెప్పినట్టే ఆగష్టు 22న మెగాస్టార్ పుట్టినరోజున ఈ సినిమాని ప్రకటిస్తారా? లేదా? అసలు ప్రోగ్రెస్ ఏమిటి? ఈ ప్రశ్నలన్నీ శేష ప్రశ్నలే. ఇప్పటివరకూ దీనికి సంబంధించిన ఎలాంటి ప్రకటనా మెగా క్యాంప్ నుంచి వెలువడలేదు. పైగా స్పీడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ అప్పట్లో 'ఆటో జానీ' అంటూ తెగ హడావుడి చేసేశాడు. చిరుకి ఫస్టాప్ స్టోరీ చెప్పాను. బాగా నచ్చింది. సెకండాఫ్ కథ రాస్తున్నా అని చెప్పాడు. కానీ ఆ తర్వాత అతీ గతీ లేదు. అయితే మధ్యలోనే బోలెడంత మెలో డ్రామా.
పూరీ కాదు వినాయక్ లైన్ లో ఉన్నారని అనుకున్నారు. అయితే అది కూడా కన్ఫమ్ కాదు, పూరీ తోనే సినిమా ఉంటుందని అన్నారు. లేటెస్టుగా మెగాస్టార్ 'కత్తి' రీమేక్ లో నటిస్తారు. దిల్‌రాజు చిరుని కలిసించి ఒప్పించారంటూ మరో కొత్త పుకారు ఫిలింనగర్ లో షికారు చేసింది. ప్రస్తుతానికి మెగా ప్రాజెక్ట్ గందరగోళంలో ఉన్నట్టేనని సన్నిహితులు చెబుతున్నారు.
ఆగష్టు 22 కి ఇంకెంతో సమయం లేదు. ఈలోగా మెగాభిమానుల్లో రకరకాల కన్ఫ్యూజన్స్. వీటన్నిటి నుంచి బైటపడేయడానికి చిరంజీవి స్వయంగా ఏదో ఒకటి ప్రకటిస్తాడని ఎదురు చూస్తున్నారంతా. చిరు లేదా చరణ్ ఏదో ఒకటి చెప్పాల్సిన టైమొచ్చింది.