Begin typing your search above and press return to search.

బ్రూస్‌ లీ ఆడియోలో 150 డీటెయిల్స్‌?

By:  Tupaki Desk   |   2 Oct 2015 11:45 AM GMT
బ్రూస్‌ లీ ఆడియోలో 150 డీటెయిల్స్‌?
X
రామ్‌ చ‌ర‌ణ్ హీరోగా శ్రీ‌నువైట్ల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన బ్రూస్‌ లీ ద‌స‌రా కానుక‌గా రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల రిలీజైన ట్రైల‌ర్‌ - పోస్ట‌ర్ ల‌కు అదిరిపోయే స్పంద‌న వ‌చ్చింది. మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాలో స్పెష‌ల్ అప్పియ‌రెన్స్ ఇస్తున్నార‌న్న వార్త మెగా భిమానుల్ని ప‌ట్టికుదిపేస్తోంది. చిరు ఓ అదిరిపోయే యాక్ష‌న్ ఎపిసోడ్‌ లో క‌నిపిస్తార‌ని, హార్స్ రైడింగ్‌ తో స్ట‌న్నింగ్ అప్పియ‌రెన్స్ ఇస్తాడ‌ని నిన్న లీకైన ఫోటోలు చెప్పేశాయి. బ్రూస్‌ లీ ప్ర‌తి అప్‌ డేట్‌ ఫ్యాన్స్‌ ని ఫుల్ ఖుష్ చేస్తున్నాయి. అందుకు త‌గ్గ‌ట్టే ఈరోజు ఈ సినిమా పాట‌లు గ్రాండ్‌ గా రిలీజైపోతున్నాయి. త‌మ‌న్ ఈ చిత్రానికి అదిరిపోయే ట్యూన్స్ ఇచ్చాడ‌ని టాక్ న‌డుస్తోంది.

ఇప్ప‌టికే హైద‌రాబాద్ హైటెక్స్ ప్రాంగ‌ణంలో మెగాభిమానుల సంద‌డి మొద‌లైంది. బ్రూస్‌లీ భారీ క‌టౌట్‌ లు, పోలీసుల హంగామాతో హ‌డావుడి రెడీ. చాలా గ్యాప్ త‌ర్వాత మెగాస్టార్ చిరంజీవి ముఖానికి రంగేసుకున్నారు. బ్రూస్‌ లీ ఆడియో వేదిక‌పై చ‌ర‌ణ్ తో క‌లిసి ప‌నిచేసిన అనుభ‌వాన్ని వివ‌రించ‌బోతున్నారు. ఇదే వేడుక‌లో చిరు నోట ఆ 150వ సినిమా డీటెయిల్స్ వినాల‌న్న కుతూహాలం అభిమానుల లో ఉంది. అందుకే ఈ ఆడియో అత్యంత ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ఇదే వేదిక‌పై చ‌ర‌ణ్‌ ని ఎంత‌గానో అభిమానించే బ‌న్ని సైతం వ‌స్తున్నాడు. చ‌ర‌ణ్ గురించి మాట్లాడ‌బోతున్నాడు. ఇవ‌న్నీ బ్రూస్‌ లీ ఆడియోకి బోలెడంత హైప్ తెచ్చేశాయి. మరి కాసేప‌ట్లో ఆడియోకి సంబంధించిన మ‌రిన్ని డీటెయిల్స్‌ తో క‌లుద్దాం....