Begin typing your search above and press return to search.
చిరు అలా కొరటాల ఇలా హీరోయిన్ ఎలా?
By: Tupaki Desk | 2 Aug 2018 10:41 AM ISTమెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం 'సైరా' సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పూర్తికాక ముందే కొరటాల శివ డైరెక్షన్లో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. నవంబర్లో సెట్స్ మీదకు వెళ్ళనున్న ఈ సినిమాకు ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. స్క్రిప్ట్ ను మెరుగులు దిద్దడం తో పాటుగా క్యాస్టింగ్, టెక్నిషియన్స్ ఎంపికపై దృషి సారించాడట కొరటాల.
ఇందులో అన్నిటికన్నా ముఖ్యమైనది హీరోయిన్ ఎంపిక. చిరు వయసుకు సూటబుల్ హీరోయిన్ ను ఎంపిక చేసేవిషయం కష్టమన్న విషయం ఓపెన్ సీక్రెటే. చిరు కూడా 'ఖైది నెంబర్ 150'.. 'సైరా' సినిమాలకు హీరోయిన్లను ఎంపిక చేసే సమయంలో ఆ ఇబ్బందిని గమనించాడు కాబట్టే ఓ సీనియర్ హీరాయిన్ ను తీసుకుందామని కొరటాలకు సూచించాడట. చిరుతో జతకట్టేందుకు అనుష్క - త్రిష లాంటి హీరోయిన్ లు సిద్ధంగా ఉన్నారట. కానీ కొరటాల మాత్రం కొత్త హీరోయిన్ ను తీసుకుందామని అంటున్నాడట.
ముప్పై ఏళ్ళ పైన వయసుండే ముంబై మోడల్స్ ను లేదంటే ఒక పాపులర్ హిందీ టీవీ సీరియల్ నటిని కానీ తీసుకుంటే పెయిరింగ్ తాజాగా ఉంటుందని - సినిమాకు కొత్త ఫ్రెష్ లుక్ వస్తుందని అంటున్నాడట. మరి కొరటాల చిరు సూచనను ఫాలో అవుతాడో లేదంటే ఆయనను కన్విన్స్ చేసి తన మాటే నెగ్గించుకుంటాడో వేచి చూడాలి.