Begin typing your search above and press return to search.

ప్ర‌భాస్ త‌న‌లోని రాముడి ని బ‌య‌టికి తెచ్చాడు!-చిన‌జీయ‌ర్

By:  Tupaki Desk   |   6 Jun 2023 9:58 PM GMT
ప్ర‌భాస్ త‌న‌లోని రాముడి ని బ‌య‌టికి తెచ్చాడు!-చిన‌జీయ‌ర్
X
ప్ర‌తి మ‌నిషి లో రాముడున్నాడు. అయితే ఆ రాముడి ని బ‌యటికి తేవడం అవ‌స‌రం. శ్రీ‌మాన్ ప్ర‌భాస్ త‌న‌ లోని రాముడి ని బ‌య‌టికి తెచ్చాడు. ఇలాంటి మ‌హోన్న‌త కార్య‌క్ర‌మాలు చేస్తున్న ప్ర‌భాస్ కి ఏడు కొండ‌ల పైన ఉన్న వెంక‌టేశుని ఆశీస్సులు ప‌రిపూర్ణంగా ఉండాలి.. అని ఆశీస్సులు అందించారు శ్రీ‌శ్రీ‌శ్రీ‌ చిన‌జీయార్ స్వామీజీ. తిరుప‌తి వెంకటేశ్వ‌ర విశ్వ‌విద్యాల‌య‌ గ్రౌండ్స్ లోని ఆదిపురుష్ 3డి ప్రీరిలీజ్ వేదిక‌పై ప్ర‌భాస్ - ఓంరౌత్ అండ్ టీమ్ కి స్వామీజీ ఆశీస్సులు అందించ‌డ‌మే గాక అద్భుత ప్ర‌సంగంతో యువ‌త‌రంలో స్ఫూర్తిని నింపారు. రామాయ‌ణం శ్రీ‌రాముని చ‌రిత్ర‌ పై చిన‌జీయార్ స్వామీజీ ఎన్నో ఆస‌క్తిక‌ర విష‌యాల‌ ను ఈ వేదిక‌ పై పంచుకున్నారు. యువ‌త‌రం త‌మ‌ లోని మంచివాడైన‌ రాముడి ని బ‌య‌టికి తేవాల‌ని కూడా చిన‌జీయార్ పిలుపునిచ్చారు.

శ్రీ‌శ్రీ చిన‌జీయార్ మాట్లాడుతూ... శ్రీ‌మాన్ ఓంరౌత్.. చ‌రిత్ర‌ ను కామ‌న్ మేన్ కి చూపించేందుకు ఈ దేశం ప్ర‌పంచం లోని యువ‌త‌రాని కి చూపించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నందుకు భ‌గ‌వంతు ని ఆశీస్సులు అందుకుంటున్నార‌ని అన్నారు. రాముడు మ‌హాపురుషుడు. మాన‌వ‌జాతి కి ఆద‌ర్శ‌పురుషుడు..ఏ మోడ్ర‌న్ మేన్..చాలా మంది దేవుడి గా కొలుస్తారు కొల‌వ‌చ్చు.. దేవ‌తలంతా వ‌చ్చి రామా నువ్వు సాక్షాత్తూ నారాయ‌ణ‌డ‌వ‌యా. సీతాదేవి సాక్షాత్తూ ల‌క్ష్మి అయా అని చెబితేనే వారు దేవ‌త‌ల‌ ని తెలిసింది. కానీ శ్రీ‌రాముడు మాన‌వ అవ‌తారంలో మ‌నిషి గానే కొన‌సాగారు.

రామానుజుడు తిరుప‌తి కి వ‌చ్చి 18 సార్లు అత‌డి చ‌రిత్ర‌ ను తెలుసుకున్నాడు. పుస్త‌కాలు రాసారు. శ్రీ‌రాముని పై చాలా సినిమాలొచ్చాయి. టీవీల్లో ధారావాహిక‌లు వ‌చ్చాయి. కానీ ఆ త‌రం దాటింది. ఇప్ప‌టి త‌రానికి మ‌ళ్లీ రాముడు కావాలి. ఈత‌రానికి సంబంధించిన టెక్నాల‌జీ తో రాముడు కావాలి. అందుకు అనుగుణంగా విజువ‌ల్ టెక్నాల‌జీ తో శ్రీ‌రాముడి ని చూపిస్తున్నారు. కేవ‌లం దేశానికి మాత్ర‌మే కాదు ప్ర‌పంచానికే చూపిస్తున్నారు. టీమ్ కి ఆశీస్సులు... అని చిన‌జీయ‌ర్ బ్లెస్ చేసారు.

రాముడు దేవుడు అన‌గానే ఆ దేవుడికేం లెండి ఏమైనా చేస్తాడు .. అని మాన‌వులు త‌ప్పించుకునే ప్ర‌మాదం ఉంది. ఒక మ‌నిషి ఒక మార్గాన ప్ర‌యాణించి ఆద‌ర్శ‌వంతుడయ్యాడ‌ని నిరూపించేందుకు రాముడు మాన‌వుడ‌య్యాడు. రామాయ‌ణం లో రాముడు మంచి మ‌నిషి. ఆయ‌న పుట్ట‌క‌ముందు విష్ణువు. అవ‌తారం చాలించ‌క ముందు విష్ణువు. జీవ‌న స‌మ‌తుల్యంలో మ‌నిషి గా ప్ర‌వ‌ర్తించాడు. ఒక మ‌నిషి మ‌నిషి గా ఉండ‌గ‌లిగితే దేవ‌త‌లు కూడా అత‌డి వెంట న‌డుస్తాడు. మ‌నం దేవ‌త‌ల వెంట ప‌రిగెట్ట‌క్క‌ర్లేదు. దేవ‌త‌లు మంచి మ‌నిషి వెన‌క న‌డుస్తారు. మంచి మ‌నుషుల‌ కు ప్ర‌జ‌లు ఆల‌యాలు క‌డ‌తారని నిరూప‌ణ అయింది.. అని అన్నారు.

దేవ‌త‌లు చెప్ప‌లేదు.. మ‌నుషులు చెప్ప‌లేదు.. రుషులు చెప్ప‌లేదు.. రాక్ష‌సుడు అయిన మారీచుడు చెప్పాడు. రాముడు అంటే మంచి ఆచ‌ర‌ణ‌ కు నిలువెత్తు రూప‌మ‌యా అని చెప్పాడు. మ‌నిషి మ‌నిషి గా ఉంటే అత‌డి కి శ‌త్రువే ఉండ‌డు. రాముడి ని మ‌నుషులు దేవ‌త‌లు రుషులు చెట్లు ప‌క్షులు ప్రేమించ‌డం ఒక అద్భుతం. ల‌క్ష్మ‌ణుడు ముక్కు చెవులు కోసిన శూర్ప‌ణ‌ఖ శ్రీ‌రామ‌చంద్రు ని తిట్టాల‌ని నోరు తెరిచి చివ‌రికి తిట్ట‌లేక తిరిగి కీర్తించింది... అని స్వామీజీ రామాయ‌ణ క‌థ‌ను చెప్పారు. శ్రీ‌రాముని పై సినిమా తీసారు కాబ‌ట్టి తాను ఇలాంటి సినిమా వేదిక‌ పైకి తొలిసారి గా విచ్చేశాన‌ని చిన‌జీయార్ వెల్ల‌డించారు.