Begin typing your search above and press return to search.

ఇది సరిపోదు చినబాబు!

By:  Tupaki Desk   |   15 July 2018 6:29 AM GMT
ఇది సరిపోదు చినబాబు!
X
బాగా పడిపోయింది అనుకున్న తన మార్కెట్ ని గత ఏడాది వచ్చిన ఖాకీతో కొంత మేర నిలబెట్టుకున్న హీరో కార్తీ కొత్త సినిమా చినబాబు అంచనాలకు తగ్గట్టు బాక్స్ ఆఫీస్ దగ్గర పెర్ఫర్మ్ చేయలేకపోతోంది. మౌత్ పబ్లిసిటీతో పాటు టాక్ కొంతవరకు పర్వాలేదు అని వచ్చినా దాని తాలూకు ప్రభావం మాత్రం కలెక్షన్స్ లో కనిపించడం లేదు. మొదటి రోజు కోటి రూపాయల షేర్ తేవడానికి చాలా కష్టపడ్డ చినబాబు ఖాకీ కంటే తక్కువ తెచ్చుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి మొత్తం కోటి 80 లక్షల గ్రాస్ తో కోటి 35 వేల షేర్ తో ఇంతేనా అనిపించినా కార్తీ తెలుగు ప్రేక్షకులను మెప్పించడం అంత సులభం కాదనే నిజం గ్రహిస్తున్నాడు. ప్రమోషన్ బాగానే చేసినప్పటికీ సెంటిమెంట్ మరీ శృతి మించడంతో పాటు టీవీ సీరియల్ ని తలపించే డ్రామాని దర్శకుడు పాండిరాజ్ పండించడం అంతగా వర్క్ అవుట్ కావడం లేదు. పైగా కార్తీ సత్య రాజ్ తప్ప మొత్తం అందరు తెలుగు ప్రేక్షకులకు అంతగా పరిచయం లేని వాళ్ళు కావడంతో డిస్ కనెక్ట్ అయ్యేలా చేస్తోంది. ఇక ఏరియాల వారీగా వసూళ్లు ఈ విధంగా ఉన్నాయి

నైజామ్ - 35 లక్షలు

సీడెడ్ - 15 లక్షలు

నెల్లూరు - 4 లక్షల 50 వేలు

గుంటూరు - 15 లక్షల 95 వేలు

కృష్ణ - 7 లక్షల 45 వేలు

వెస్ట్ - 3 లక్షల 65 వేలు

ఈస్ట్ - 6 లక్షల 80 వేలు

ఉత్తరాంధ్ర - 12 లక్షలు

తెలుగు రాష్ట్రాలు మొత్తం మొదటి రోజు షేర్ - 1 కోటి 35 వేలు

ఏ రకంగా చూసుకున్నా ఇవి చాలా తక్కువ వసూళ్లు. ఖాకీ మొదటి రోజు 2 కోట్ల 10 లక్షల గ్రాస్ తో చాలా మెరుగ్గా నిలిచింది. దానికి వచ్చిన పాజిటివ్ టాక్ ఓ రెండు వారాల పాటు బాక్స్ ఆఫీస్ వద్ద బలంగా నిలిచేలా చేసింది. కానీ చినబాబుకు అంత సీన్ కనిపించడం లేదు. వసూళ్లలో ఏ మాత్రం మార్పు లేకపోవడంతో పాటు వీక్ ఎండ్ కాబట్టి ఈ రోజు ఆదివారాన్ని నెట్టుకొచ్చినా రేపటి నుంచి అసలు పరీక్ష మొదలవుతుంది. ఆరెక్స్ 100 తప్ప బలమైన పోటీ ఏది లేకపోయినా తాను టార్గెట్ చేసిన ఫామిలీస్ ని కూడా చినబాబు మెప్పించలేకపోవడం విచిత్రమే.