Begin typing your search above and press return to search.

#చిన్మ‌యి లీక్స్.. హైదరాబాద్ లేడీస్ హాస్ట‌ల్లో చీడ‌పురుగు

By:  Tupaki Desk   |   2 Dec 2020 12:45 PM IST
#చిన్మ‌యి లీక్స్.. హైదరాబాద్ లేడీస్ హాస్ట‌ల్లో చీడ‌పురుగు
X
ప్ర‌ముఖ లిరిసిస్ట్ వైర‌ముత్తుపై మీటూ వేదిక‌గా అలుపెర‌గ‌ని పోరాటం సాగించిన గాయ‌ని కం డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మ‌యి .. ఇప్ప‌టికీ మ‌హిళామ‌ణుల‌కు అండ‌గా నిలుస్తూ వారి త‌ర‌పున త‌న ట్విట్ట‌ర్ వేదిక‌లో బ‌ల‌మైన గొంతు వినిపిస్తున్నారు.

ఇప్ప‌టికే ప‌లువురు పురుష‌పుంగ‌వుల వికృత చేష్ఠ‌ల‌ను ట్వీట్ వేదిక‌గా ప్ర‌శ్నించారు. తాజాగా గుజ‌రాత్ లేడీస్ హాస్ట‌ల్ వార్డెన్ వికృత చేష్ట‌ల‌పై మీడియాలో వ‌చ్చిన క‌థ‌నాలు చూశాక‌.. చిన్మ‌యి చేసిన ఓ ట్వీట్ ఆస‌క్తిక‌రంగా మారింది.

గుజ‌రాత్ త‌ర‌హాలోనే సేమ్ టు సేమ్ వికృత వార్డెన్‌ మన హైదరాబాద్ లోను ఉన్నార‌న్న విష‌యం బ‌య‌ట‌పడింది చిన్మ‌యి ట్వీట్ తో. ఓ ప‌దో త‌ర‌గ‌తి అమ్మాయిని లేడీ వార్డెన్ వేధించిన తీరు ప్ర‌ముఖంగా చ‌ర్చ‌కు వ‌చ్చింది. హైదరాబాద్ లో ఓ వార్డెన్‌ పైశాచికత్వంపై స‌ద‌రు బాలిక స్పందనను తన ట్విట్టర్‌ ద్వారా చిన్మ‌యి రివీల్ చేశారు.

``నేను 2015లో ప‌ది చ‌దువుతున్నా. చదువు రీత్యా హైదరాబాద్‌ హాస్టల్ ‌లో చేరాను. వార్డెన్‌ అమ్మాయిలను ఇబ్బంది పెట్టేది. పీరియడ్స్‌ ఉన్నాయని చెప్పిన నమ్మేది కాదు. బట్టలు విప్పి చూపించమనేది. ఓసారి నాకు అలాంటి పరిస్థితే ఎదురైంది. క్లాసులో ఉండగానే పీరియడ్స్ రావ‌డంతో హాస్టల్ కి వెళితే బ‌ట్ట‌లు విప్పించింది`` అంటూ ఆవేద‌నగా నాటి ఘ‌ట‌న‌ను స‌ద‌రు బాలిక వెల్ల‌డించింది. సంఘంలో ఇలాంటి చీడపురుగులున్నారు అంటూ చిన్మయి ఫైర‌వ్వ‌డంతో అది కాస్తా ట్విట్ట‌ర్ లో వైర‌ల్ గా మారుతోంది.