Begin typing your search above and press return to search.
ఈసారి మనోను టార్గెట్ చేసిన చిన్మయి
By: Tupaki Desk | 10 Feb 2020 11:53 AM ISTతమిళ మరియు తెలుగు సినీ ప్రేక్షకులకు సింగర్ కమ్ డబ్బింగ్ ఆర్టిస్టు అయిన మనో గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. తమిళ స్టార్ హీరోల సినిమాలు తెలుగు లో డబ్ అయితే ఎక్కువగా మనోనే హీరో పాత్రకు డబ్బింగ్ చెప్తాడు. ఇక ఎన్నో పాటలు పాడి మెప్పించిన గాయకుడు మనో. ఈమద్య జబర్దస్త్ కామెడీ షోలో కూడా కనిపిస్తున్నాడు. అలాంటి మనోపై సింగర్ చిన్మయి సంచలన ఆరోపణలు చేసింది. న్యాయం చేస్తాడని మనో గారి వద్దకు వెళ్తే ఆయన అన్యాయంగా మాట్లాడారు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడులో జరుగుతున్న డబ్బింగ్ ఆర్టిస్టు అసోషియేషన్ ఎన్నికల్లో చిన్మయి పోటీ చేసేందుకు అవకాశం దక్కలేదు. ఆమె సభ్యత్వం గురించి కోర్టు లో కేసు నడుస్తున్న కారణంగా ఆమె ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హురాలు కాదన్నారు. ఇదే సమయంలో గతంలో లైంగిక వేదింపుల ఆరోపణలు ఎదుర్కొన్న ప్రముఖ గాయకుడు కార్తిక్ కు యూనియన్ లో చోటు దక్కడంతో చిన్మయి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కార్తిక్ కు మద్దతుగా మనో ప్రచారం చేయడం పై చిన్మయి కి కోపం వచ్చింది.
దాంతో మనో గురించిన ఒక విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. కార్తిక్ పై లైంగిక వేదింపుల ఆరోపణలు చేస్తున్న అమ్మాయిలను తీసుకుని తన ఇంటికి రమ్మంటూ మనోగారి నుండి కాల్ వచ్చింది. న్యాయం ఏమైనా చేస్తాడేమో అని నేను వారిని వెంట పెట్టుకుని వెళ్లాను. ప్రతి ఒక్కరికి కుటుంబాలు ఉంటాయి.. అందరం కింది స్థాయి నుండి వచ్చిన వాళ్లమే. కనుక ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయాలన్నట్లుగా చిన్మయితో మనో అన్నాడట. కింది స్థాయి నుండి వచ్చినందుకు సింగర్ గా కార్తిక్ అంటే నాకు గౌరవం ఉంది. కాని అతడు పేరు వచ్చిన వెంటనే చేసిన లైంగిక వేదింపుల పై మాత్రం తాను చూస్తూ ఊరుకో లేను అంటూ తాను సమాధానం చెప్పినట్లుగా చిన్మయి చెప్పుకొచ్చింది.
కార్తిక్ తరపున వకాల్తా పుచ్చుకుని రాజీ కుదిర్చేందుకు మనో ప్రయత్నించాడంటూ ఆయన ఇమేజ్ ను డ్యామేజ్ చేసేలా చిన్మయి మాట్లాడిరది. దాంతో ఇప్పుడు మనో పై విమర్శలు వస్తున్నాయి. లైంగిక వేదింపుల కేసును రాజీ కుదర్చడం ఏంటంటూ ఎద్దేవ చేశారు.