Begin typing your search above and press return to search.

షాక్: న‌య‌న‌తార చేతిలో ఆ బిడ్డ ఎవ‌రు?

By:  Tupaki Desk   |   28 Aug 2021 10:08 PM IST
షాక్: న‌య‌న‌తార చేతిలో ఆ బిడ్డ ఎవ‌రు?
X
అందాల న‌య‌న‌తార ద‌ర్శ‌కుడు విఘ్నేష్ శివ‌న్ తో ప్రేమ‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ జంట త్వ‌ర‌లోనే పెళ్లికి సిద్ధ‌మ‌వుతున్నార‌ని క‌థ‌నాలు వైర‌ల్ అవుతున్నాయి. ఇటీవ‌లే త‌మ నిశ్చితార్థం క‌న్ఫామ్ అయ్యింద‌నేందని ప్రూఫ్ గా న‌య‌న్ అంగుళీక ప్ర‌ద‌ర్శ‌న అభిమానుల్లో హాట్ టాపిక్ అయ్యింది.

ఇప్పుడు ఏకంగా న‌య‌నతార‌ చేతిలో ఓ ప‌సిబిడ్డ ప్ర‌త్య‌క్ష‌మ‌వ్వ‌డం అభిమానుల‌కు షాకింగ్ గా మారింది. ఇంత‌కీ ఎవ‌రా ప‌సిపాప‌? న‌య‌న్ వార‌సురాలా? లేదూ తెర కోసం ఎంపిక చేసుకున్న పాపా? అంటూ ఒక‌టే సందిగ్ధ‌త‌ను వ్య‌క్తం చేస్తున్నారు. ప‌సిపాప‌ను ఎత్తుకుని ఉన్న న‌య‌న్ తో విఘ్నేష్ ఫ్రేమ్ లో క‌నిపించ‌డం సందేహాల‌కు తావిస్తోంది.

న‌య‌న్ - విఘ్నేష్ జంట త‌మ ప్రేమ‌ను ఓపెన్ గా ప్ర‌క‌టించి ఆరేళ్ల‌య్యింది. ఇన్నేళ్లుగా ఈ జంట స‌హ‌జీవ‌నంలో ఉన్న క్ర‌మంలో ఈ ప‌సిబిడ్డ ఇప్పుడు స‌స్పెన్స్ ఎలిమెంట్ గా మారింది. న‌య‌న్ ప్ర‌స్తుతం న‌టిస్తున్న కాతు వాకుల రేండు కాద‌ల్ చిత్రంలో ఆ చిన్నారి ఒక పాత్ర పోషించి ఉండొచ్చ‌న్న ఊహాగానాలు సాగుతున్నాయి. ఈ చిత్రంలో న‌య‌న్ - స‌మంత క‌థానాయిక‌లుగా న‌టిస్తుండ‌గా విజ‌య్ సేతుప‌తి క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్నారు. విఘ్నేష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

ఈ జంట ఎంద‌రికో స్ఫూర్తి..

న‌య‌న‌తార‌- విఘ్నేష్ శివ‌న్ జంట ప్రేమాయ‌ణం నిరంత‌రం అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారుతున్నా... ఆ ఇద్ద‌రూ ఎవ‌రికి వారు పాజిటివ్ వేలో కెరీర్ ప‌రంగా బిజీగా ఉన్నారు. అలాగే రౌడీ పిక్చర్స్ పతాకంపై సినిమాల్ని నిర్మిస్తున్నారు. నయనతార - విఘ్నేష్ శివన్ సమర్పణ‌లో ఈ బ్యాన‌ర్ పై తెర‌కెక్కిన త‌మిళ క‌ల్ట్ చిత్రం `కూజంగల్` (గులకరాళ్లు) అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ -రోటర్ డామ్ లో పుర‌స్కారాన్ని గెలుచుకుంది. విగ్నేష్ శివన్ త‌న ప్రేయ‌సి నయనతారతో ఆ ఆనంద క్ష‌ణాల్ని పంచుకున్నారు. ``మా మొదటి అంతర్జాతీయ అవార్డుతో మేము.. మా ఫస్ట్ ఫిల్మ్ #గులకరాళ్లు (కూజంగల్).. మాకు ప్రతిష్టాత్మకమైన టైగర్ అవార్డ్ ని రోటర్ డామ్ నుండి చెన్నై ఇంటి వ‌ర‌కూ తీసుకువచ్చింది. మేము మా హృదయానికి దగ్గరగా చేసిన ప‌నికి ద‌క్కిన గౌర‌వ‌మిది.. ధన్యవాదాలు.. ఈ చిత్రానికి ద‌క్కుతున్న‌ ప్రశంసలు ప్రోత్సాహంతో మాకు చాలా సంతోషంగా గర్వంగా ఉంది! అని విఘ్నేష్ ఆనందం వ్య‌క్తం చేశారు.

న‌య‌న్ ఇక‌పై నిర్మాత‌గానూ కొన‌సాగుతార‌ని ఈ జోడీ ప‌లు నిర్మాణ సంస్థ‌ల‌తో క‌లిసి సినిమాలు నిర్మించేందుకు ఆస‌క్తిగా ఉన్నార‌ని క‌థ‌నాలొస్తున్నాయి. కొన్ని అగ్ర నిర్మాణ సంస్థ‌ల‌తో చేతులు క‌లిపేందుకు ఈ జంట ప్ర‌ణాళిక‌ల్లో ఉన్నార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. భ‌విష్య‌త్ ప్ర‌ణాళిక‌ల దృష్ట్యా న‌య‌న్ అన్ని ప‌రిశ్ర‌మ‌ల అగ్ర హీరోలు నిర్మాత‌ల‌తో విన‌య‌పూర్వ‌కంగా స‌త్సంబంధాలు కొన‌సాగిస్తున్నారు.

ఇంకా అగ్ర హీరోల‌కు ఏకైక ఆప్ష‌న్ న‌య‌న్..

టాలీవుడ్ లో అగ్ర హీరోల స‌రస‌న క‌థానాయికగా న‌టించారు న‌య‌న‌తార‌. సీనియ‌ర్ న‌టీమ‌ణిగా ర‌జ‌నీకాంత్-చిరంజీవి-బాల‌కృష్ణ‌- వెంక‌టేష్- నాగార్జున వంటి సీనియ‌ర్ల‌ స‌ర‌స‌న న‌టించిన న‌య‌న్ చాలా అరుదుగా యువ‌హీరోల స‌ర‌స‌నా న‌టిస్తున్నారు. ఆస‌క్తిక‌రంగా మెగాస్టార్ చిరంజీవి స‌ర‌స‌న న‌టించిన న‌య‌న్ .. మ‌రోసారి చిరుతో సినిమాకి అంగీక‌రించారు. కానీ ఈసారి ఇందులో విల‌న్ గా న‌టిస్తున్న స‌త్య‌దేవ్ స‌ర‌స‌న నాయిక‌గా న‌టించేందుకు అంగీక‌రించ‌డం ఆశ్చ‌ర్యప‌రిచింది. స‌త్య‌దేవ్ ఇప్పుడిప్పుడే కెరీర్ ప‌రంగా స్థిర‌ప‌డుతు అత‌డి స‌ర‌స‌న న‌టించేందుకు న‌య‌న్ అంగీక‌రించ‌డం ఆస‌క్తిక‌రం. లూసీఫ‌ర్ రీమేక్ గాడ్ ఫాద‌ర్ లో న‌య‌న్ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నుంది. మోహన్ రాజా దర్శకత్వం వ‌హిస్తున్నారు. ఎన్వీ ప్ర‌సాద్ -చ‌ర‌ణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.