Begin typing your search above and press return to search.

అత‌డు` చైల్డ్ ఆర్టిస్ట్ ... హీరోగా ఎంట్రీ !

By:  Tupaki Desk   |   12 Dec 2021 12:30 PM GMT
అత‌డు` చైల్డ్ ఆర్టిస్ట్ ... హీరోగా ఎంట్రీ !
X
బాల న‌టులు హీరోల‌గా ప్ర‌మోట్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. తాజాగా `అత‌డు` చిత్రంతో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన దీప‌క్ స‌రోజ్ ఇప్పుడు అప్ క‌మింగ్ హీరోగా ప్ర‌మోట్ అవ్వ‌డానికి గ‌ట్టి ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు. `అత‌డు` లో బ్ర‌హ్మ‌నందం కుమారుడి పాత్ర‌లో మెప్పించిన దీప‌క్ దాదాపు 20 సినిమాల్లో బాల న‌టుడిగా న‌టించాడు. ఇప్పుడా బుడ్డోడు పెరిగి పెద్ద‌వాడు అయ్యాడు. య‌వ్వ‌నంలోకి ఎంట్రీ ఇచ్చేసాడు. నూనుగు మీసాల ఈ కుర్రాడు ఇప్పుడు బిజీ స్టార్ మారే ప్ర‌య‌త్నాల్లో బిజీ అయ్యాడు. `మిణుగురులు` చిత్రంలోనూ ఓ కీల‌క పాత్ర పోషించి మెప్పించాడు. ఆ సినిమాకు జాతీయ అవార్డు కూడా రావ‌డంతో దీప‌క్ కి నేష‌న‌ల్ లెవ‌ల్లో గుర్తింపు ద‌క్కింది.

ఆ సినిమా రిలీజ్ అయి ఏడేళ్లు పూర్త‌యింది. దీప‌క్ `బిగ్ బాస్ -5` లోనూ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇస్తున్న‌ట్లు అప్ప‌ట్లో ప్ర‌చారం సాగింది. కానీ ఫైన‌ల్ లిస్ట్ లో దీపక్ లేడు. ఆ ర‌కంగా దీప‌క్ స‌రోజ్ ఓ ఐడెంటినీ క్రియేట్ చేసుకున్నాడు. ఇక ముందున్న టార్గెట్ పెద్ద హీరోగా ఎద‌గ‌డ‌మే. అందుకు త‌గ్గ‌ట్టు శ‌రీరాన్ని మ‌లుచుకుంటున్నాడు. మంచి ఫిజిక్ తో సిక్స్ ప్యాక్ ప్ర‌య‌త్నాల్లో ఉన్నాడు. ప్ర‌స్తుతం దీప‌క్ కొత్త ఫోటోలు కొన్ని సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి. బ్ర‌హ్మ‌నందంతో క‌లిసి దిగిన కొన్ని ఫోటోలు నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. మ‌రి ఈ యంగ్ ట్యాలెంట్ టైమ్ ఎలా ఉంద‌న్న‌ది కాల‌మే నిర్ణ‌యించాలి.

ప్ర‌తిభా వంతుల్ని టాలీవుడ్ ఎప్పుడూ ఎంక‌రేజ్ చేస్తుంది. ఇటీవ‌లి కాలంలో కొత్త వాళ్లు ఎక్కువ‌గా స‌క్సెస్ అవుతున్నారు. క‌సి..క‌మిట్ మెంట్..డెడికేష‌న్ ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేనివాళ్ల‌లోనే ఎక్కువ‌గా క‌నిపిస్తుంది. బాల న‌టుడిగానే సినిమాల‌పై త‌న ఫ్యాష‌న్ ని చూపించిన దీప‌క్ హీరోగాను ఎద‌గాల‌ని ఆశిద్దాం. ఇప్ప‌టికే ఓచిత్రంలో హీరోగా అవ‌కాశం వ‌చ్చింద‌ని టాక్ వినిపిస్తోంది. కానీ పూర్తి వివ‌రాలు ఇంకా బ‌య‌ట‌కు రాలేదు.