Begin typing your search above and press return to search.

చికెన్‌ కొంటే బాహుబలి టిక్కెట్‌ ఫ్రీ

By:  Tupaki Desk   |   8 July 2015 9:56 PM IST
చికెన్‌ కొంటే బాహుబలి టిక్కెట్‌ ఫ్రీ
X
బుర్ర బుర్రకో ఐడియా! బుర్ర తిరిఅగిపోయే ఐడియాలెన్నో!! ఫ్యాంటు కొంటే చొక్కా ఫ్రీ, చీర కొంటే జాకెట్‌ ఫ్రీ, కూల్‌డ్రింక్‌ కంటే స్ట్రా ఫ్రీ .. ఇలాంటి ఆఫర్లు చూశాం కానీ, ఏకంగా చికెన్‌ కొంటే సినిమా టిక్కెట్టు ఫ్రీ .. లాంటి ఆఫర్‌ ఎప్పుడైనా చూశామా? ఇన్నేళ్లలు ఇలాంటివి విన్నామా? కన్నామా? ప్రపంచీకరణ నేపథ్యంలో మార్కెటింగ్‌ నైపుణ్యం విపరీతంగా పెరిగిపోయింది. ఒక మనిషిని ఇంకో మనిషి అమ్మేస్తున్నాడు. ప్రతిదీ అమ్మకమే ఇక్కడ. అందుకే ఆ చికెన్‌ షాపు ఓనర్లకు భలే ఐడియా తట్టింది.

ఇప్పుడు ఏకంగా బాహుబలి క్రేజును క్యాష్‌ చేసుకోవడానికి ఓ కొత్త పన్నాగం పన్నారు నెల్లూరు వాసులు. చికెన్‌ దుకాణాల ముందు ఏకంగా బాహుబలి బోర్డ్‌లు పెట్టేసి, ఆ పోస్టర్‌పై రూ.500 చికెన్‌ కొంటే ఒక టిక్కెట్టు ఫ్రీ అంటూ ఆఫర్‌ పెట్టేశారు. అదీ 10, 11,12 తేదీల్లోనే టిక్కెట్‌ ఆఫర్‌. ఆలసించిన ఆశాభంగం అంటూ.. ఒకటే టముకు. ఫైవ్‌ స్టార్‌ చికెన్‌, టెన్‌ స్టార్‌ చికెన్‌ అంటూ హడావుడి చేసేస్తున్నారు. అసలే ఆన్‌లైన్‌ జామ్‌ అయిపోయింది. హైదరాబాద్‌ నుంచి విశాఖ, రాజమండ్రి లాంటి చిన్న చిన్న పట్టణాల్లోనూ బాహుబలి మానియా నడుస్తోంది. మల్లీప్టెక్సు, టూరింగ్‌ థియేటర్‌ అనే తేడా లేకుండా ప్రతిచోటా బాహుబలి టిక్కెట్ల కోసం ఎగబడుతున్నారు.