Begin typing your search above and press return to search.

స్విట్జ‌ర్లాండ్ అల్ఫైన్ ప‌ర్వతాల్లో చెర్రీ

By:  Tupaki Desk   |   3 Dec 2021 8:30 AM GMT
స్విట్జ‌ర్లాండ్ అల్ఫైన్ ప‌ర్వతాల్లో చెర్రీ
X
మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టించిన పాన్ ఇండియా చిత్రం RRR రిలీజ్ కి రెడీ అవుతున్న సంగ‌తి తెలిసిందే. రిలీజ్ కి ఇంకా నెలరోజులే స‌మ‌యం ఉండ‌టంతో ప్ర‌చార కార్య‌క్ర‌మాల్ని యూనిట్ స్పీడ‌ప్ చేయ‌బోతుంది. డిసెంబ‌ర్ అంతా యూనిట్ ఆ ప‌నుల్లో నిమ‌గ్నం కానుంది. దేశ విదేశాల్లో ప్ర‌మోష‌న్ చేయాలి కాబ‌ట్టి టీమ్ అంతా స‌ర్వం సిద్ధం చేస్తోంది. ఇప్ప‌టికే దుబాయ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. అటుపై వివిధ రాష్ట్రాల్ని చుట్టేయాల్సి ఉంది. దీంతో ఆ బిజీ కి ముందుగానే రామ్ చర‌ణ్ వెకేష‌న్ కి వెళ్లిన‌ట్లు తెలుస్తోంది. చెల్లెలు శ్రీజ క‌ళ్యాణ్ స‌హా స్నేహితుల‌తో క‌లిసి స్విట్జ‌ర్లాండ్ ట్రిప్ లో ఉన్నారు.

స్వీస్ టూర్ ని ఆస్వాధిస్తున్న కొన్ని ఫోటోల్ని ఇన్ స్టా వేదిక‌గా చ‌ర‌ణ్ పంచుకున్నారు. స్విస్ శిఖ‌రాల‌పైకి ఎక్కి ఫోటోలు దిగారు. స్విస్ అందాల బ్యాక్ డ్రాప్ లో అల్ఫైన్ ప‌ర్వతాల ముందు నుంచొని కెమారాకి ఫోజులిచ్చారు. ఇందులో చ‌ర‌ణ్ క్యాజువ‌ల్ జీన్స్.. టీష‌ర్ట్ దానిపైన వింట‌ర్ కోట్ ధ‌రించాడు. న‌లుపు రంగు షూస్..చేతికి గ్లౌస్ ధ‌రించాడు. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు వైర‌ల్ గా మారాయి. మెగా ప‌వ‌ర్ స్టార్ అభిమానులు త‌మ‌దైన శైలిలో కామెంట్లతో ఆస్వాధిస్తున్నారు. ఇక చ‌ర‌ణ్ -శంక్ర‌ర్ ప్రాజెక్ట్ విష‌యానికి వ‌స్తే ఇప్ప‌టికే కొద్ది భాగం షూటింగ్ పూర్త‌యింది. డిసెంబ‌ర్ నుంచి శంక‌ర్ ఇండియ‌న్ -2 షూటింగ్ తిరిగి ప్రారంభించాల్సి ఉంది.

ఈ నేప‌థ్యంలో చ‌ర‌ణ్ సినిమా షూటింగ్ ని తాత్కాలికంగా ప‌క్క‌న‌బెట్టిన‌ట్లు తెలుస్తోంది. ఈ గ్యాప్ లోనే చ‌ర‌ణ్ ఇలా స్విస్ చెక్కేసిన‌ట్లు తెలుస్తుంది. ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ త‌ర్వాత చ‌ర‌ణ్ కొత్త ప్రాజెక్ట్ ని ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది. శంక‌ర్ భార‌తీయుడు -2 షూటింగ్ పూర్తి చేసేలోపు చ‌ర‌ణ్ కొత్త సినిమా ప‌ట్టాలెక్కించ‌డానికి ఆస్కారం ఎక్కువ‌గా ఉంద‌న్న‌ది స‌మాచారం. ఇప్ప‌టికే `జెర్సీ` ఫేం గౌత‌మ్ తిన్న‌నూరి స్క్రిప్ట్ ని చ‌ర‌ణ్ లాక్ చేసిన సంగ‌తి తెలిసిందే.