Begin typing your search above and press return to search.

'చెప్పకే చెప్పకే' మేకింగ్ వీడియో: మహా సముద్రపు ఒడ్డున సరదా సరదాగా..!

By:  Tupaki Desk   |   27 Sep 2021 1:47 PM GMT
చెప్పకే చెప్పకే మేకింగ్ వీడియో: మహా సముద్రపు ఒడ్డున సరదా సరదాగా..!
X
'Rx100' అజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్ - బొమ్మరిల్లు సిద్ధార్థ్ హీరోలుగా తెరకెక్కుతున్న చిత్రం ''మహా సముద్రం''. ఇందులో అదితిరావు హైదరీ - అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 14న ఈ చిత్రాన్ని థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా మేకర్స్.. ఇటీవల సినిమాలోని 'చెప్పకే చెప్పకే' అనే మెలోడీ గీతాన్ని విడుదల చేశారు. ఈ సాంగ్ శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంది.

తాజాగా 'చెప్పకే.. చెప్పకే..' పాట మేకింగ్ వీడియోని చిత్ర బృందం రిలీజ్ చేసింది. వైజాగ్ బీచ్ అందాలు - రాక్స్ మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో సరదా సరదాగా ఈ పాటను చిత్రీకరించినట్లు అర్థం అవుతోంది. స్వర్ణ మాస్టర్ ఈ సాంగ్ కు కొరియోగ్రఫీ చేశారు. అదితి రావు హైదరి మీద షూట్ చేసిన ఈ పాటలో శర్వానంద్ - సిద్ధార్థ్ - అను ఇమ్మాన్యుయేల్ కూడా కనిపిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ ఈ గీతానికి బాణీలు సమకూర్చగా.. చైతన్య ప్రసాద్ సాహిత్యం అందించారు. గాయని దీప్తి పార్థసారథి ఆలపించిన ఈ సాంగ్ సినిమా థీమ్ ని తెలియజేస్తోంది.

'మహా సముద్రం' చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ - టీజర్ - సాంగ్స్ విశేష స్పందన తెచ్చుకున్నాయి. ఇక ట్రైలర్ 7.3 మిలియన్ల వ్యూస్ తో యూట్యూబ్ లో ట్రెండింగ్ లో కొనసాగుతోంది. వినూత్నమైన కథ, కథనాలతో ఇంటెన్స్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా అజయ్ భూపతి ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. రాజ్ తోటా సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ప్రవీణ్ కేఎల్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. కొల్లా అవినాష్ దీనికి ప్రొడక్షన్ డిజైనర్. ఈ చిత్రంలో జగపతి బాబు - రావు రమేష్ - కేజీయఫ్ గరుడ రామ్ - శరణ్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై సుంకర రామబ్రహ్మం ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.