Begin typing your search above and press return to search.

సాయం చేసే చేతులకు మార్గం ఇదే

By:  Tupaki Desk   |   4 Dec 2015 12:18 PM GMT
సాయం చేసే చేతులకు మార్గం ఇదే
X
చెన్నై వరద బీభత్సానికి.. టాలీవుడ్ వెల్లువలా కదులుతోంది. కొంతమంది నిధులు దానం చేస్తే, మరికొంతమంది ఆహార పొట్లాలు అందించి సాయపడుతున్నారు. ఇప్పుడు అక్కడి పరిస్థితి ప్రత్యక్షంగా చూస్తుండడంతో.. మరింతమంది సాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే సాయం చేయాలని ఉన్నా.. ఎలాగో తెలియనివారికి రామానాయుడు స్టూడియోస్ ఓ అపూర్వ అవకాశాన్ని అందిస్తోంది. సహాయం చేయాలని ఉండి, చేసే దారి తెలీని వారికోసం.. ఆయా వస్తువులను అందించడానికి హైద్రాబాద్ జూబిలీహిల్స్ లోని రామానాయుడు లో ఓ సెంటర్ ప్రారంభించారు.

ప్రతీ రోజూ తమకు వచ్చిన వస్తువులను.. ఇక్కడి నుంచి చెన్నైకి పంపించే ఏర్పాట్లు పూర్తి చేశారు. మంచి నీరు, బిస్కెట్లు-గ్లూకోజ్ పౌడర్ లాంటి పాడవని తిండి పదార్ధాలు, మెడికల్ సామాగ్రి.. ఇలా ఏదైనా అక్కడ అందిచచ్చు. వాటిని 24 గంటల్లో చెన్నైకి పంపి.. అక్కడి వారికి సాయం చేసేలా చర్యలు చేపట్టారు. మరిన్ని వివరాల కోసం రామానాయుడు స్టూడియోలో సంప్రదించవచ్చు. నిధుల సహాయం కంటే.. ఇలా వస్తువులను పంపితే, ఆపదలో ఉన్నవారికి తక్షణమే ఉపయోగపడతాయన్న ఆలోచనతోనే.. ఇలా చేస్తున్నట్లు నిర్వాహకులు చెబ్తున్నారు.