Begin typing your search above and press return to search.

ఒకే లొకేషన్ లో ఉన్నా ఒకరినొకరు చూసుకోని చై-సామ్..?

By:  Tupaki Desk   |   26 Dec 2021 2:30 AM GMT
ఒకే లొకేషన్ లో ఉన్నా ఒకరినొకరు చూసుకోని చై-సామ్..?
X
టాలీవుడ్ స్టార్ కపుల్ అక్కినేని నాగచైతన్య - సమంత జంట విడిపోతున్నట్లు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు. చై-సామ్ తమ ఏడేళ్ల ప్రేమకు నాలుగేళ్ళ వివాహ బంధానికి గుడ్ బై చెప్పడాన్ని అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేక పోతున్నారు. అయితే విడాకుల ప్రకటన అనంతరం ఇద్దరూ ఎవరికి వారు తమ జీవితాలను కొనసాగిస్తున్నారు.

నాగచైతన్య - సమంత ఇద్దరూ తమ లైఫ్ లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించే క్రమంలో వరుస ప్రాజెక్ట్స్ తో బిజీ అవుతున్నారు. హృదయ విదారకమైన విడాకులకు కారణాలు ఏవైనా.. దీని తర్వాత వీరిద్దరూ ఒకరినొకరు మళ్ళీ కలుసుకోలేదు. ఒకరి గురించి ఒకరు మాట్లాడలేదు. కాకపోతే ఇటీవల సామ్ మాత్రం పరోక్షంగా డివోర్స్ మీద ఓపెన్ అయింది. చైతూ మాత్రం ఎప్పటిలాగే సైలెంట్ గా ఉంటూ వస్తున్నాడు.

చై సామ్ విడిపోయినప్పటికీ ఇద్దరూ ఒకే ఫీల్డ్ లో ఉన్నవారు కావడంతో, ఏదొక సందర్భంలో ఒకరికొకరు ఎదురు పడాల్సిన సిచ్యుయేషన్ వస్తుందని అందరూ అనుకున్నారు. అనుకున్నట్లుగా ఇటీవల అలాంటి సందర్భం వచ్చినా.. ఇద్దరూ ఒకరినొకరు చేసుకోకుండా జాగ్రత్త పడ్డారని టాక్ వినిపిస్తోంది.


చైతన్య నటిస్తున్న 'బంగార్రాజు' సినిమా లాస్ట్ షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో జరగగా.. సమంత ప్రధాన పాత్ర పోషిస్తున్న 'యశోద' చిత్రీకరణ కూడా అదే స్టూడియోలో జరిగింది. అయితే చై సామ్ రోజులో ఏదొక సందర్భంలో ఒకరికొకరు ఎదురుపడకుండా చూసుకోవాలని తమ సిబ్బందికి తెలియజేశారట.

వారి ఆదేశాలకు తగినట్లుగా ఏర్పాట్లు చేయడంతో నాగచైతన్య మరియు సమంత ఇద్దరూ తమ పనులను పూర్తి చేసుకొని.. ఒకరినొకరు చూసుకోకుండానే స్టూడియో నుండి బయలుదేరారని టాక్ నడుస్తోంది. ఇదే కనుక నిజమైతే.. విడిపోయినా కూడా స్నేహితులుగా కొనసాగుతామని వీరిద్దరు ప్రకటించినప్పటికీ.. మళ్ళీ కలుసుకోడానికి ఇష్ట పడటంలేదని అనుకోవచ్చు.

ఇటీవల నాగచైతన్య పుట్టినరోజు సందర్భంగా సమంత కనీసం సోషల్ మీడియాలో కూడా శుభాకాంక్షలు తెలుపలేదు. అదే సమయంలో దగ్గుబాటి రానా - మిహికా లకు విషెస్ తెలిపడం చర్చనీయాంశంగా మారింది. అక్కినేని ఫ్యామిలీకి దూరంగా ఉంటున్న సామ్.. దగ్గుబాటి కుటుంబానికి దగ్గర అవుతోందనే కామెంట్స్ కూడా వచ్చాయి. ఏదేమైనా వీరిద్దరూ తమ జీవితంలో జరిగిన హార్ట్ బ్రేకింగ్ పరిస్థితుల నుంచి వీలైనంత త్వరగా బయటకు వచ్చి కెరీర్ మీద ఫోకస్ పెట్టినందుకు ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.

ఇక సినిమాల విషయానికొస్తే.. నాగచైతన్య ప్రస్తుతం 'బంగార్రాజు' 'థాంక్యూ' చిత్రాల్లో నటిస్తున్నాడు. త్వరలో విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ కోసం ఓ వెబ్ సిరీస్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఇది యువసామ్రాట్ కు డిజిటల్ డెబ్యూ. ఇందులో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేస్తుండటం విశేషం.

మరోవైపు సమంత 'కాతువాకుల రెండు కాదల్' 'శాకుంతలం' సినిమాలను పూర్తి చేసి ప్రస్తుతం 'యశోద' మూవీ షూటింగ్ లో పాల్గొంటోంది. అలానే 'అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్' అనే హాలీవుడ్ మూవీ చేయనుంది. దీంతో పాటుగా వరుణ్ ధావన్ తో కలిసి ఓ వెబ్ సిరీస్.. తాప్సి నిర్మాణంలో ఓ హిందీ మూవీ చేయనుందని టాక్ వినిపిస్తోంది.