Begin typing your search above and press return to search.

ఫన్ ట్రిప్ కాదు.. ఫన్ గా ఉండే వర్క్!

By:  Tupaki Desk   |   2 May 2019 12:06 PM IST
ఫన్ ట్రిప్ కాదు.. ఫన్ గా ఉండే వర్క్!
X
వరస విజయాలతో సమంతా అక్కినేని ఫుల్ జోష్ లో ఉన్న సంగతి తెలిసిందే. తన సినిమాల సక్సెస్ కంటే కుడా స్వీట్ హబ్బీ నాగ చైతన్యతో కలిసి నటించిన 'మజిలీ' సూపర్ డూపర్ హిట్ కావడంతో సమంతా సంతోషానికి అవధులు లేవు. ఈ సినిమాతో పాటు సామ్ నందినీ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఓ బేబీ' లో కూడా నటిస్తోంది. ఈ సినిమాతో పాటుగా సామ్ '96' రీమేక్ లో నటించేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనడానికి ముందే మరో షూటింగ్ లో పాల్గొని సర్ ప్రైజ్ ఇచ్చింది.

రాహుల్ రవీంద్రన్ అక్కినేని నాగార్జున 'మన్మథుడు 2' కు దర్శకుడు అనే సంగతి తెలిసిందే. రాహుల్ నిన్న తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఒక ఫోటోను షేర్ చేస్తూ "బెస్ట్ ఫ్రెండ్స్ కలిసి పనిచేస్తే వర్క్ అంతా ఫన్ గా ఉంటుంది" అంటూ ట్వీట్ చేశాడు. ఆ ఫోటోలో రాహుల్ తో పాటుగా సమంతా.. వెన్నెల కిషోర్ ఇద్దరూ ఉన్నారు. దీంతో ఒక విషయం అర్థం అయిపోయింది. సమంతా 'మన్మథుడు 2' షూటింగ్ లో పాల్గొంది అనే విషయం ఇన్ డైరెక్ట్ గా చెప్పారని అనుకోవాలి. 'మన్మథుడు 2' షూట్ ప్రస్తుతం పోర్చుగల్ లోనే జరుగుతోంది. సో.. సమంతా అక్కడికి వెళ్ళి మామగారి సినిమా షూట్ లో పాల్గొంది. ఈ సినిమాలో సమంతాతో పాటుగా చైతు కూడా ఒక స్మాల్ క్యామియో చేస్తున్నాడట.

'మజిలీ' ప్రమోషన్స్ సమయంలో 'మన్మథుడు 2' లో తన క్యామియో గురించి సమంతా ఒక హింట్ ఇచ్చింది. అప్పట్లో 'మన్మథుడు 2' టీమ్ సీక్రెట్ గా ఉంచాలనుకున్న విషయాన్ని లీక్ చేసిందని కూడా కామెంట్స్ వినిపించాయి. మామగారు నాగార్జున తో సామ్ స్క్రీన్ షేర్ చేసుకోవడం ఇది మూడో సారి.. 'మనం'.. 'రాజుగారి గది 2' సినిమాల్లో ఇలా కలిసి నటించారు. ఈసారి మాత్రం పూర్తి స్థాయి పాత్ర కాదు. జస్ట్ క్యామియోనే. 'మన్మథుడు 2' సినిమాకు సమంతా ఒక స్పెషల్ అట్రాక్షన్ గా మారుతుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు.