Begin typing your search above and press return to search.

లావణ్య కు 'చావు కబురు చల్లగా' టీమ్ బర్త్ డే విషెస్..!

By:  Tupaki Desk   |   15 Dec 2020 12:00 PM IST
లావణ్య కు చావు కబురు చల్లగా టీమ్ బర్త్ డే విషెస్..!
X
యువ హీరో కార్తికేయ గుమ్మకొండ - లావ‌ణ్య త్రిపాఠి జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ''చావు కబురు చల్లగా''. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌ పై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంతో కొత్త దర్శకుడు పెగళ్ళపాటి కౌశిక్ ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. ఇందులో కార్తికేయ స్వర్గపురి వాహనం నడిపే బస్తీ బాలరాజుగా నటిస్తుండగా.. లావణ్య 'మల్లిక' పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన 'చావు కబురు చల్లగా' ఫస్ట్ లుక్ మరియు టీజర్ విశేష స్పందన తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో నేడు హీరోయిన్ లావ‌ణ్య త్రిపాఠి పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్ ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ కొత్త పోస్టర్ ని విడుదల చేసింది.

ఇందులో లావ‌ణ్య మామూలు డ్రెస్ ధరించి క్యూట్ స్మైల్ తో సాధారణ యువతిగా కనిపిస్తోంది. ఆమె ఈ సినిమాలో నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. లాస్ట్ ఇయర్ 'అర్జున్ సురవరం' సినిమాతో మంచి హిట్ అందుకున్న లావ‌ణ్య త్రిపాఠి కి 'చావు కబురు చల్లగా' ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి. ఈ చిత్రంలో ఆమని - శ్రీకాంత్‌ అయ్యంగర్ - మహేష్ - భద్రం తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో కనిపిస్తున్నారు. ఈ చిత్రానికి జేక్స్‌ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు. కోవిడ్ నేపథ్యంలో తిరిగి ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ లో కీల‌క స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ జరుపుతున్నట్లు తెలుస్తోంది.