Begin typing your search above and press return to search.

మహేష్ బాబుతో లైవ్ చాటింగ్ కు రెడీనా?

By:  Tupaki Desk   |   14 May 2016 3:18 PM IST
మహేష్ బాబుతో లైవ్ చాటింగ్ కు రెడీనా?
X
బ్రహ్మోత్సవం ఆడియో మొన్ననే జరిగింది. ఇక రోజుకొకరు చొప్పున ఈ సినిమా ప్రమోషన్ స్టార్ట్ చేసేశారు. మొన్న సినిమాటోగ్రాఫర్ రత్నవేలు.. నిన్న కాజల్..సమంత ఓ ఈవెంట్లో పాల్గొని మూవీ ప్రమోషన్ చేశారు. అంతేనా కాజల్ అగర్వాల్ ప్రత్యేకంగా పెద్ద పత్రికలకు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చేసింది. ఇక మిగిలింది మహేష్ బాబునే. అతను కూడా మూవీ ప్రమోషన్ ను కావాల్సినంత స్ప్రెడ్ చేసేయడానికి రెడీ అయిపోయాడు. ముందుగా సోషల్ మీడియా ద్వారా అభిమానులకు చేరువ కావాలని చూస్తున్నాడు.

అందుకే ఈ సాయంత్రం 6.30 గంటలకు(6.30pm IST/9am EST) మహేష్ బాబుతో లైవ్ చాట్ చేయాలనుకునే వారు సిద్ధంగా వుండాలంటున్నారు. ఫ్రీడోకాస్ట్ వారు ఈ లైవ్ చాటింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు నిర్వహిస్తున్నాడు. అభిమానులు బ్రహ్మోత్సవం విశేషాలతోపాటు.. మహేష్ ను ఎంతో కాలంగా అడగాల్సిన ప్రశ్నలను కూడా సంధించొచ్చు. వీటన్నింటికి ప్రిన్స్ మహేష్ ఎంతో ఓపిగ్గా సమాధానం ఇవ్వనున్నాడు. గెట్ రెడీ టు ఆస్క్ యువర్ క్వశ్చన్స్ మై డియర్ మహేష్ ఫ్యాన్స్!