Begin typing your search above and press return to search.

రేష్మి ఇంత పగ పట్టేసిందేంటో?

By:  Tupaki Desk   |   22 April 2016 12:44 PM GMT
రేష్మి ఇంత పగ పట్టేసిందేంటో?
X
హీరోయిన్ గా పేరు సంపాదించాలనే కసితో .. గుంటూరు టాకీస్ లో రేష్మీ గౌతమ్ ఏ రేంజ్ లో రెచ్చిపోయిందో చూశాం. హాట్ యాంకర్ కాస్తా.. హాటెస్ట్ హీరోయిన్ గా దర్శనమిచ్చే సరికి మాస్ జనాలకు మతులు పోయాయి. ఈ సారి ఓ రివెంజ్ స్టోరీతో జనాల ముందుకు వస్తోంది. ఆ సినిమా పేరే చారులత. రీసెంట్ గా విడుదలైన చారులత ట్రైలర్ లో రేష్మి గౌతం అందాలు ఆరబోసే రోల్ లో కనిపించలేదు.

కాసేపు కామెడీ - మరికాసేపు భయం - ఇంకాసేపు భయపెట్టే రకం.. ఇలా రకరకాల కోణాల్లో యాక్టింగ్ ట్యాలెంట్ చూపించే అవకాశం రేష్మీకి దక్కింది. ఆమె భర్తగా రాజీవ్ కనకాల ఓ కుర్చీకి పరిమితం అయ్యే రోల్ అయినా.. కీలకమైన రోల్ నే చేశాడు. ఎందుకంటే.. రేష్మీ పగ తీర్చుకునే సన్నివేశాలు అతనితోనే ఉన్నాయి. వీటికి తోడు తెలియని సస్పెన్స్ తో మరో రోల్ కూడా ఉంది. ఇక బ్రహ్మీతో కాసేపు కామెడీ పండించే ప్రయత్నం కూడా చేశారు కానీ.. ట్రైలర్ లోనే జులాయి మూవీలో బ్రహ్మీ సీన్స్ చూపించడం కాస్త అతిగా ఉందని ఒప్పుకోవాలి.

మరో వైపు.. రేష్మీ తన లుక్ కి భిన్నంగా సీరియస్ డైలాగులు చెబుతుంటే.. వినడానికి కష్టంగానే అనిపించింది. పైగా పంచ్ ల కోసం అనుకుంటా.. లెంగ్తీ డైలాగ్స్ కూడా చెప్పాల్సి వచ్చింది. ఓవరాల్ గా ట్రైలర్ అయితే ఇంట్రెస్టింగ్ గానే ఉన్నా.. రష్మీ నుంచి ఆడియన్స్ ఆశించినవన్నీ ఆ రేంజ్ లో అందడం అనుమానంగా అనిపిస్తోంది. మరి చారులత ఏం చేయనుందో?