Begin typing your search above and press return to search.

పూరి 'రొమాంటిక్' డైలాగులు హైలైట్ : చార్మీ

By:  Tupaki Desk   |   23 Oct 2021 3:07 AM GMT
పూరి రొమాంటిక్ డైలాగులు హైలైట్ : చార్మీ
X
ఈ మధ్య కాలంలోనే ఫస్టు పోస్టర్ తోనే యూత్ ను విపరీతంగా ఆకట్టుకున్న సినిమా ఏదైనా ఉందంటే, అది 'రొమాంటిక్' అనే చెప్పాలి. ఆ ఊపులోనే ఈ సినిమా థియేటర్లకు వచ్చేసేది. కానీ కరోనా కారణంగా పరిస్థితులు అనుకూలించకపోవడంతో, సరైన విడుదల సమయం కోసం ఎదురుచూస్తూ వచ్చింది. ఇక ఇప్పుడు పరిస్థితులు చాలావరకూ సర్దుకున్నాయి. దసరా సమయంలో థియేటర్లన్నీ కూడా దడదడలాడాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రేక్షకులను పలకరించడానికి ఉత్సాహపడుతోంది.

'రొమాంటిక్' సినిమా నుంచి ప్రభాస్ ట్రైలర్ వదిలిన దగ్గర నుంచి ఈ సినిమాపై మరింతగా అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమా విడుదల తేదీ కోసం అంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అలాంటి ఈ సినిమా ఈ నెల 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆకాశ్ పూరి - కేతిక శర్మ జంటగా నటించిన ఈ సినిమాను, పూరితో కలిసి చార్మీ నిర్మించారు. విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా, నిన్నరాత్రి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరుపుకుంది. ఈ వేడుకలో చార్మీ మాట్లాడారు.

"లైగర్ విజయ్ దేవరకొండకి చాలా థ్యాంక్స్ .. ఇక్కడికి వచ్చినందుకు. త్రీ హవర్స్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినందుకు. మళ్లీ త్రీ హవర్స్ ఇక్కడి నుంచి అక్కడికి తిరిగి వెళ్లాలి .. నాట్ ఏ జోక్. నాకు తెలిసి విజయ్ దేవరకొండకి లాంగ్ డ్రైవ్స్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. షూటింగు పక్కనే హోటల్ ఉండాలి .. హోటల్ పక్కనే షూటింగు లొకేషన్ ఉండాలి. అలాంటి ఆయన 'రొమాంటిక్' కోసం .. నా కోసం .. పూరి గారి కోసం .. ఫ్యాన్స్ కోసం ఇంత దూరం వచ్చారు. అందుకు నేను ఆయనకు థ్యాంక్స్ చెబుతున్నాను.

చెప్పుకోవలసిన పేర్లు చాలానే ఉన్నాయి. ఇప్పుడు అంత టైమ్ తీసుకుంటే మంచిది కాదు. ఆకాశ్ .. కేతిక .. రమ్య .. దేవయాని .. ఉత్తేజ్ ఎవ్రీవన్ అందరూ చాలా బాగా చేశారు. సాంగ్స్ చాలా బాగా వచ్చాయి. 'రొమాంటిక్'లో పూరిగారు రాసిన డైలాగులు మీరు మళ్లీ మళ్లీ చెప్పుకుంటారు. ఈ ఫంక్షన్ ఇక్కడ ఇంత గొప్పగా జరగడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వరంగల్ కి మొన్న వచ్చాము .. ఇప్పుడు వచ్చాము .. మళ్లీ వస్తాము .. మళ్లీ మళ్లీ వస్తాము మీ ముందుకు" అంటూ ముగించారు.