Begin typing your search above and press return to search.

ఆ ఇద్దరి కోసం ఛార్మి అడుగున్నర త్యాగం

By:  Tupaki Desk   |   6 July 2016 4:58 AM GMT
ఆ ఇద్దరి కోసం ఛార్మి అడుగున్నర త్యాగం
X
పంజాబీ అమ్మాయి అయిన చార్మి కౌర్ లో ఒక ప్రత్యేకత.. ఆమె పొడుగాటి శిరులు. జ్యోతిలక్ష్మి వరకూ తన లాంగ్ హెయిర్ ని చూపిన ఛార్మి.. ఇప్పుడు షార్ట్ హెయిర్ తో కనిపిస్తోంది. ఇందుకు కారణం.. ఓ ఇద్దరి కోసం తన జుట్టును త్యాగం చేసేసింది ఈ బ్యూటీ. కేన్సర్ పేషెంట్స్ ఇద్దరికి తన హెయిర్ తో విగ్గులు తయారు చేయిస్తోంది.

'ఇద్దరు టీనేజ్ గాళ్స్ ను కలిసేందుకు రమ్మంటూ ఒక ఫ్రెండ్ నుంచి పిలుపు వచ్చింది. వాళ్లిద్దరూ క్యాన్సర్ పేషెంట్స్ అని.. అంతే కాదు నా అభిమానులని చెప్పాడు. వారితో కొంత సేపు గడిపేందుకు నిర్ణయించుకుని వెళ్లాను. ప్రస్తుతం వాళ్లిద్దరూ కీమోథెరపీ చేయించుకుంటున్నారు. ఈ ట్రీట్మెంట్ కారణంగా వారి జుట్టు మొత్తం పోయింది. నేను అక్కడున్నంత సేపు వాళ్లు నా హెయిర్ లోకి చేతులు పోనిచ్చి.. "ఛార్మీ అక్కా మీ హెయిర్ చాలా బాగుంది"అని పొగడుతూనే ఉన్నారు. నాకు వారి బాధ - అభిమానం చూసి కళ్ల వెంట నీళ్లొచ్చేశాయి' అని చెప్పింది ఛార్మి.

తిరిగి తన ప్లేస్ కి రాగానే హెయిర్ స్టైలిస్ట్ ని పిలిపించి.. తన కేశాలను కత్తిరించేయమని చెప్పిందట ఛార్మి. 18 అంగుళాల పొడుగున అంటే అడుగున్నర మేర కత్తిరించిన జుట్టుతో రెండు మంచి విగ్గులు తయారు చేయమని కూడా చెప్పానని అంటోంది. 'విగ్గులు రెడీ అయ్యాక నేనే వెళ్లి స్వయంగా అందిస్తాను. వాటిని అందుకునేపుడు వారి కళ్లలో మెరుపులను నేను స్వయంగా చూడాలని అనుకుంటున్నా' అంటూ ఉత్సాహంగా చెప్పింది ఛార్మి.