Begin typing your search above and press return to search.
ఛార్మి ఎందుకు వకాల్తా పుచ్చుకుంటోందబ్బా..
By: Tupaki Desk | 20 July 2017 1:20 PM ISTడ్రగ్స్ కేసులో పూరి జగన్నాథ్ తో పాటు ఆయనకు అత్యంత సన్నిహితులైన పలువురికి పోలీసుల నుంచి నోటీసులందాయి. అందులో ఛార్మి కూడా ఒకరు. ఐతే తన మీద వచ్చిన ఆరోపణల గురించి.. నోటీసులందడం గురించి కానీ ఛార్మి ఇప్పటిదాకా స్పందించలేదు. ఆమె తండ్రి మాత్రం తన కూతురికి ఈ వ్యవహారంతో అసలేమాత్రం సంబంధం లేదంటూ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఛార్మి మాత్రం సైలెంటుగా ఉంది.
ఐతే తన మీద వచ్చిన ఆరోపణల గురించి ఏం మాట్లాడని ఛార్మి సోషల్ మీడియాలో పూరి జగన్నాథ్ కు మద్దతుగా పోరాటం చేస్తుండటం విశేషం. నిన్న ‘సిట్’ బృందం ఆధ్వర్యంలో పది గంటలకు పైగా సుదీర్ఘంగా సాగిన విచారణను పూర్తి చేసుకుని వచ్చాక పూరి ఒక ఎమోషనల్ వీడియో మెసేజ్ పెట్టాడు. ఆయనలా వీడియో మెసేజ్ పెట్టడం ఆలస్యం ఛార్మి రంగంలోకి దిగిపోయింది.
రెస్పెక్ట్ పూరి సర్ అంటూ ఒక మెసేజ్ పెట్టిన ఛార్మి.. ఆ తర్వాత ‘వుయ్ సపోర్ట్ పూరి జగన్’ అంటూ ఒక హ్యాష్ ట్యాగ్ పెట్టి పూరి అభిమానుల్లో కదలిక తెచ్చే ప్రయత్నం మొదలుపెట్టింది. ఎక్కడ ఎవరు పూరికి మద్దతుగా మాట్లాడినా పట్టుకొచ్చి ఆ ట్వీట్ ను రీట్వీట్ చేసేస్తోంది ఛార్మి. తన సంగతేంటో చూసుకోకుండా ఇలా పూరికి వకాల్తా పుచ్చుకుని ఛార్మి పోరాటం చేస్తుండటమే జనాలకు ఆశ్చర్యం కలిగిస్తోంది. పూరి కుటుంబ సభ్యులే ఈ వ్యవహారంపై సైలెంటుగా ఉన్నారు. పూరి కూడా నిన్నటి మెసేజ్ మినహాయిస్తే ఏమీ స్పందించింది లేదు.
అలాంటిది స్వయంగా తాను కూడా డ్రగ్స్ కు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటూ.. ఇలా పూరి తరఫున ఛార్మి పోరాటం చేయడంలో ఆంతర్యమేంటో అర్థం కావడం లేదు. పూరి సినిమాల ప్రొడక్షన్ వ్యవహారాల్లో ఛార్మిది కీలక పాత్ర అని సినీ జనాలకు తెలుసేమో కానీ.. సామాన్య జనాలకు వీళ్లిద్దరి బంధం గురించి పెద్దగా తెలియదు. దీంతో ప్రస్తుతం పూరి విషయంలో వకాల్తా పుచ్చుకుని ఛార్మి స్పందిస్తున్న తీరు వారికి ఆశ్చర్యం కలిగిస్తోంది.