Begin typing your search above and press return to search.

తెలిసి షేర్ చేసిందా? తెలియక చేసిందా?

By:  Tupaki Desk   |   25 Oct 2017 1:08 PM IST
తెలిసి షేర్ చేసిందా? తెలియక చేసిందా?
X
సోషల్ మీడియా ప్రభావంతో స్టార్స్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ చాలానే పెరుగుతోంది. మొన్నటి వరకు సాధారణంగా ఉన్న స్టార్స్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో కొన్ని ఫొటోస్ పోస్ట్ చేస్తూ వైరల్ గా మారుస్తున్నారు. ముఖ్యంగా హీరోయిన్స్ అయితే వారి ఫోటోస్ తెగ షేర్ చేస్తున్నారు. హాట్ ఫొటోస్ అయినా సరే ఏ మాత్రం అభ్యంతరం లేకుండా పోస్ట్ చేస్తున్నారు.

అయితే రీసెంట్ గా ఛార్మి ఎవరు ఊహించని విధమైన పోస్ట్ చేసి అందరికి షాక్ ఇచ్చింది. ప్రస్తుతం అమ్మడు పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తోన్న మెహబూబా సినిమాకి లైన్ ప్రొడ్యూసర్ గా వర్క్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పూరి తనయుడు ఆకాష్‌.. మరోసారి హీరోగా ఇంట్రొడ్యూస్ అవుతున్నాడు. అయితే ఎప్పటికప్పుడు ఈ సినిమాకు సంబందించిన విషయాలను ఛార్మి బాగానే షేర్ చేస్తోంది. ప్రస్తుతం మొదటి షెడ్యూల్ షూటింగ్ లో చిత్ర యూనిట్ చాలా బిజీగా ఉంది.

అయితే పూరి జగన్నాథ్ సిగరెట్ తాగుతుండగా తీసిన ఒక ఫొటోను ఛార్మి తన ట్విట్టర్ వాకౌట్ పోస్ట్ చేసింది. అమ్మడు తెలిసి చేసిందో తెలియక చేసిందో తెలియదు గాని ఈ మధ్య సెలబ్రెటీలు సిగరెట్ తాగుతూ దిగిన ఫొటోలు మాత్రం చాలా వైరల్ అవుతున్నాయి. అయినా ఎవరి వ్యక్తిగత విషయం వారిది అంటున్నారు కొందరు నెటిజన్స్. ఇకపోతే ప్రస్తుతం హిమాచల్ లో సినిమా షూటింగ్ జరుగుతోంది. అక్కడ చలి కూడా చాలా ఎక్కువగా ఉందట. అందుకే ఈ సిగరెట్లు అనుకోవాలేమో!!