Begin typing your search above and press return to search.
డాషింగ్ గాళ్.. ఇప్పుడు కాల్‌గాళ్!!
By: Tupaki Desk | 10 April 2015 11:43 AM ISTఅందాల ఛార్మికి డాషింగ్ గాళ్ అన్న పేరుంది. మంత్ర, మంగళ, ప్రేమ ఒక మైకం .. వంటి చిత్రాల్లో ఛార్మి నటన చూసినవారికి ఆ సంగతి ఇట్టే అర్థమవుతుంది. ఈ భామ ప్రస్తుతం 'జ్యోతిలక్ష్మి'గా నటిస్తోంది. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 58రోజులు.. పరిమిత బడ్జెట్.. పరిమిత వనరులతోనే సినిమాని పూర్తి చేస్తున్నాడు. ఈ చిత్రంలో ఛార్మి పాత్ర ఏమిటి? అన్న ప్రశ్నకు అప్పట్లో నిర్మాత సి.కళ్యాణ్ ఓ హింటిచ్చారు.
పరిశ్రమలో ఆడాళ్లను తక్కువ చేసి మాట్లాడేవాళ్లకు చెంపపెట్టు అనిపించే పాత్రలో ఛార్మి నటిస్తోంది. మగాళ్లను ప్రశ్నించే ఆడదానిగా కనిపిస్తుంది అని చెప్పారు. అయితే లేటెస్టుగా ఇంకో లీకేజీ బైటపడింది. జ్యోతిలక్ష్మికి సంబంధించిన అసలు రహస్యం బైటికొచ్చింది. జ్యోతిలక్ష్మి ఓ సినిమా కథానాయిక. వ్యభిచారిణి. ఆ వృత్తిలో తనకి ఎలాంటి పరాభవాలు ఎదురయ్యాయి? ఎవరి వల్ల? ఎందుకు? అలా మారాల్సొచ్చింది? అన్న విషయాల్ని ఈ సినిమాలో చూపించబోతున్నారట. ఇటీవలే ఒక క్యూట్ హీరోయిన్ వ్యవహారం బైటి ప్రపంచానికి తెలిసిన నేపథ్యంలో పూరి ఈ కథకు రూపకల్పన చేశారా అనే డౌట్ వస్తోందిప్పుడు. దీనికి డాషింగ్ డైరెక్టర్ ఏం చెబుతాడో? ఛార్మి ఏం చెబుతుందో? వేచి చూడాల్సిందే.