Begin typing your search above and press return to search.

వ్యభిచారే.. ఒక్క సెక్స్‌ సీన్‌ లేదు

By:  Tupaki Desk   |   10 Jun 2015 7:30 AM GMT
వ్యభిచారే.. ఒక్క సెక్స్‌ సీన్‌ లేదు
X
జ్యోతిలక్ష్మీ ఓ వ్యభిచారి కథే అయినప్పటికీ కుటుంబ ప్రేక్షకులకూ నచ్చేలా పూరి జగన్నాథ్‌ సినిమాను తీర్చిదిద్దాడని అంటోంది ఛార్మి. సినిమాలో అసభ్యకరమైన సన్నివేశాలు అస్సలుండవని చెబుతోంది ఛార్మి. ''జ్యోతిలక్ష్మీ రొటీన్‌కు భిన్నమైన లవ్‌ స్టోరీ. ఓ వేశ్యను యువకుడు ప్రేమించడం.. పెళ్లి చేసుకోవడం.. ఆ తర్వాత వాళ్ల జీవితాల్లో వచ్చిన సమస్యలు.. ఓ సీరియస్‌ ఇష్యూ మీద జ్యోతిలక్ష్మీ పోరాడటం.. ఇలా నడుస్తుంది కథ. ఆ సీరియస్‌ ఇష్యూ ఏంటన్నది తెరమీద చూడాలి. సినిమా చూశాక ప్రతి ఒక్కరూ జ్యోతిలక్ష్మీని ప్రేమిస్తారు. జ్యోతిలక్ష్మీ వ్యభిచారి పాత్రే అయినా.. ఇందులో ఎక్కడా ఒక్క సెక్స్‌ సన్నివేశం కూడా లేదు'' అని చెప్పింది ఛార్మి.

నిర్మాతగా మారిన అనుభవం గురించి చెబుతూ.. ''ఈ సినిమా గురించి పూరి గారు చెప్పినపుడే నేను నిర్మాణంలో పాలుపంచుకోవాలని అనుకున్నా. సొంతంగా నేనే ఈ డెసిషన్‌ తీసుకున్నా. నటిగా ఇన్నేళ్లుగా కొనసాగుతున్నా దొరకని కిక్కు.. నిర్మాతగా మారాక దొరికింది. సినిమా నిర్మాణంలో అంత కిక్కు ఉంది. సినిమా గురించి ప్రతి చిన్న అంశం దగ్గరగా చూశా. చాలా కొత్తగా ఉందీ అనుభవం'' అని చెప్పింది ఛార్మి. జ్యోతిలక్ష్మీ సినిమా కోసం పూరి కోరిక మేరకు 11 కిలోల బరువు తగ్గానని.. దాని ఎఫెక్ట్‌ తెరమీద కనిపిస్తుందని ఛార్మి చెప్పింది.