Begin typing your search above and press return to search.

బాబోయ్‌! ఎలుగుబంటికి మ‌సాజ్ చేస్తున్న ఛార్మి!!

By:  Tupaki Desk   |   1 July 2021 3:30 AM GMT
బాబోయ్‌! ఎలుగుబంటికి మ‌సాజ్ చేస్తున్న ఛార్మి!!
X
పూరి క‌నెక్ట్స్ సీఈవోగా ఛార్మి కౌర్ ఎంత బిజీగా ఉంటారో తెలిసిన‌దే. తీరిక స‌మ‌యాల్లో ఏం చేస్తుంటారు? అంటే.. ఇదిగో ఈ వీడియో చూస్తే ఎవ‌రైనా ఇట్టే చెప్పేస్తారు!

పెట్ డాగ్స్ అంటే ఛార్మికి ఎంత ప్రేమో తెలిసిన‌దే. త‌న ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక స్పెష‌ల్ బ్రీడ్ డాగ్ ప్ర‌త్య‌క్ష‌మ‌వుతుంటుంది. రెండు మూడు విభిన్న‌మైన డాగ్స్ ను తాను పెంచుకుంటోంది. అలాగే పూరి కేవ్ కి వెళితే అక్క‌డ చిల‌క‌లు ప‌క్షులు డాగ్స్ తోనూ ఆడుకుంటుంది ఛార్మి. ఆ డాగ్స్ తో ఆట‌లాడుతూ న‌చ్చిన‌ట్టు టైమ్ పాస్ చేస్తూ ఛార్మి అల్ల‌రి మామూలుగా ఉండ‌దు.

ఇదిగో భారీగా ఎలుగుబంటి సైజ్ లో క‌నిపిస్తున్న ఈ డాగ్ కి ఎల‌క్ట్రానికి మ‌సాజ‌ర్ తో మ‌సాజ్ చేస్తూ ఛార్మి గాలి పాట పాడుతోంది. మ‌సాజ్ మసాజ్ మ‌సాజ్... ! అంటూ పూరికి ఎంతో ఇష్ట‌మైన బ్యాంకాక్ ని గుర్తు చేశారు పూరి క‌నెక్ట్స్ సీఈవో ఛార్మి. చిరుత మూవీలో అలీ .. ఏ మ‌సాజ్ మ‌సాజ్... అని పిలిచిన‌ట్టుగా ఛార్మి ఫ‌న్నీగా సింగింగ్ చేయ‌డం క‌నిపిస్తోంది. అంతేకాదు.. బ్యాంకాక్ తీసుకెళ్లాల్సిందే! అంటూ ఆ పెట్ డాగ్ తో గోముగా చెబుతోంది. అలా గిలిగింత‌లు పెట్టేసేలా డాగ్ ఒళ్లంతా మ‌సాజ్ చేస్తుంటే ఆ లెగ్స్ ఎలా షివ‌రింగ్ అయిపోతున్నాయో చూశారుగా..!

అయితే దేవ‌ర‌కొండ‌ అభిమానుల‌కు మాత్రం ఇదేమీ ప‌ట్ట‌డం లేదు. అస‌లు లైగ‌ర్ అప్ డేట్ చెప్ప‌కుండా ఇదేమిటి? టీజ‌ర్ రిలీజ్ చేసేదెపుడు? అంటూ ప్ర‌శ్నిస్తున్నారు. త‌దుప‌రి ఇన్ స్టా కామెంట్ లో లైగ‌ర్ అప్ డేట్ ఏమిటో చెబుతుందేమో చూడాలి.